- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోన్లీనెస్‌ను దూరం చేస్తున్న ఏఐ పవర్డ్ రోబోట్స్.. ఫ్రెండ్స్‌లా హెల్ప్ చేస్తాయంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోబోట్స్ మానవులు ఒంటరితనాన్ని, స్నేహితుల కొరతను ఎదుర్కోవడంలో సహాయపడతాయని ఒక ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ మెకానికల్ సహచరులు క్రానిక్ లోన్లీనెస్‌తో సంభవించే హెల్త్ రిస్క్‌ను తగ్గిస్తాయని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చెప్తున్నారు. దాదాపు ప్రతీ 10 మందిలో ఒకరు అన్ని సమయాలలో లేదా ఎక్కువ సమయం ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ పరిస్థితి హృదయ సంబంధ వ్యాధులు, అకాల మరణాల ప్రమాదాన్ని పెంచుతోందని వెల్లడిస్తున్నాయి. ప్రజెంట్ వివిధ మానసిక సమస్యలను ఎదుర్కోవడంలో నిజమైన స్నేహితుడు అత్యధికమందికి ఉత్తమ పరిష్కార కర్తగా ఉంటున్నట్లు పలు ఎవిడెన్స్ సూచిస్తున్నాయని డ్యూక్ యూనివర్సిటీలోని సైకియాట్రీ అండ్ జెరియాట్రిక్స్ ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సమాజంతో సంబంధం లేకుండా ఒంటరిగా గడిపేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోందని, కొన్ని దేశాల్లో విడోహుడ్, రిటైర్మెంట్ కారణాలవల్ల కూడా ఈ పరిస్థితి ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇక యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 4.4 మిలియన్ల మందికి ఒక్క “నిజమైన” స్నేహితుడు కూడా ఉండటంలేదని, క్లోజ్ ఫ్రెండ్స్ లేని అమెరికన్ల సంఖ్య 1990 నుంచి ఇప్పటి వరకు 4 రెట్లు పెరిగిందని ఒక సర్వే పేర్కొన్నది. దీంతో వారు ఎక్కువగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్‌లో మునిగిపోతుంటారని వెల్లడించింది.
లోన్లీనెస్ లేదా సోషల్ ఐసోలేషన్ ప్రపంచ జనాభాలో మూడవ వంతు మందిని ప్రభావితం చేస్తున్నట్లు అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఛాట్ జీపీటీ, ఏఐ ఆధారిత రోబోలు ఒంటరి వ్యక్తులకు చక్కటి పరిష్కారం మార్గం అవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ అంతటా 307 కేర్ ప్రొవైడర్ల సర్వే ప్రకారం.. 69 శాతం మంది ఒంటరి వ్యక్తులు రోబోట్స్ తమకు సహాయం చేయగలవని నమ్ముతున్నారు. ఇక ప్రతీ పదిమందిలో ఏడుగురు వైద్య నిపుణులు కూడా ఒంటరి వ్యక్తులకు రోబోట్స్ చాలా విషయాల్లో స్నేహితుల్లా హెల్ప్ చేస్తాయని అంటున్నారు.
Also Read: గ్రహాంతర వాసులు దాక్కున్న పర్వత శిఖరం.. కుట్రలకు నిలయంగా మారిందట