- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Safe Journey : ట్రైన్‌లో ట్రిప్‌కు వెళ్తున్నారా..? ఏ బోగీలో ప్రయాణిస్తే సురక్షితమో తెలుసా?

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ ఎక్కడో ఒకదగ్గర రైలు ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్న వార్తలు మనం వింటూనే ఉంటాం. మొన్నటికి మొన్న ట్రైన్‌లో మంటలు చెలరేగాయని చైన్ లాగి, దూకే ప్రయత్నంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ మధ్య డార్జిలింగ్‌లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ కూడా పలువురిలో భద్రతాపరమైన ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు రైళ్లలో ట్రిప్‌కు ప్లాన్ చేసుకునేవారు, తరచుగా ట్రైన్లలో జర్నీ చేసేవారు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా సురక్షితంగా ఉండాలంటే ట్రైన్‌లో ఏ బోగీ(compartment)ని ఎంచుకుంటే బెటర్ అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పలువురు డిస్కస్ చేస్తున్నారు. అయితే నిపుణుల ప్రకారం ట్రైన్ జర్నీలో ఏ కంపార్టమెంట్ సురక్షితమో ఇప్పుడు చూద్దాం.
*సూదూర ప్రాంతాల్లో విహార యాత్రలకు వెళ్లేవారు సాధారణంగానే రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. పైగా ఇది సురక్షిత ప్రయాణంగా భావిస్తారు. కానీ ఇటీవల అక్కడక్కడా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో భద్రతపై ఆందోళనలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అందుకే చాలా మంది సురక్షిత రైలు ప్రయాణం కోసం ట్రైన్‌లోని ఏ బోగీలో కూర్చోవాలనే అంశంపై గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.
*ఇక సేఫ్ కంపార్ట్‌మెంట్ల విషయానికి వస్తే B1, B2, B3, B4 కోచ్‌లు పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. పైగా ఇవన్నీ ఏసీ బోగీలే. ప్యాంట్రీ కార్ ఉన్న ట్రైన్లలో బీ4 కోచ్ తర్వాత ఎస్1, ఎస్2, ఎస్3 అనే స్లీపర్ కోచ్‌లు కూడా వస్తాయి. ఇవి పబ్లిక్ బాక్స్‌లుగా పేర్కొనే జనరల్ బోగీలతో కలిపి ఉంటాయని రైల్వే రంగంపట్ల అవగాహన కలిగిన నిపుణులు అంటున్నారు. ఇక వీటిలో ఏ కంపార్ట్‌మెంట్ జర్నీ సేఫ్ ? అన్నప్పుడు చాలా మంది ప్రయాణికులు ఎస్1 చాలా సురక్షితమైందని చెబుతుంటారు. కానీ దీనికంటే ట్రైన్ మధ్య భాగంలో ఉండే బి4 బోగీ కూడా అత్యంత సురక్షితమైందని నిపుణులు అంటున్నారు.
*వాస్తవానికి ప్రమాదాల సమయంలో సైడ్ కంపార్టుమెంట్లు హాని కలిగిస్తాయని కూడా చెబుతుంటారు. కాబట్టి మీరు సురక్షిత ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మధ్య భాగంలో ఉన్న కంపార్ట్ మెంట్ బుక్ చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. సీట్ల విషయానికి వస్తే ఒక ట్రైన్‌లో 72 సీట్లు ఉంటే.. వీటిలో 32 నుంచి 35 వరకు సీట్లు చాలా వరకు సురక్షితమైనవిగానే భావిస్తారు. అంటే ప్రమాదాల సమయంలో కూడా ఈ సీట్లల్లో కూర్చున్నవారు గాయపడే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రైలు ప్రయాణం చేసేవారు సేఫ్ కంపార్టుమెంట్ల గురించి సమాచారం ముందే తెలుసుకొని ప్రొసీడ్ అయితే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఒకింత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.