మీ భాగస్వామికి సెక్స్ ఇష్టం లేదా? అయితే ఇలా చేయండి!

by Prasanna |   ( Updated:2023-06-24 14:18:58.0  )
మీ భాగస్వామికి సెక్స్ ఇష్టం లేదా? అయితే ఇలా చేయండి!
X

దిశ, ఫీచర్స్ : కొత్తగా పెళ్లయిన జంటలో లేదా అప్పటికే డేటింగ్‌లో భాగస్వాముల్లో వ్యక్తిగత కారణాల వల్ల ఎవరో ఒకరికి రొమాన్స్‌కు దూరంగా ఉండాలని అనిపించవచ్చు. వివిధ లక్ష్యాలు సాధించే క్రమంలో అప్పుడే సంతానం వద్దని భావించేవారు కూడా సెక్స్‌కు దూరంగా ఉండాలనుకోవచ్చు. అయితే భాగస్వామితో ఈ విషయం చెప్పడానికి మాత్రం ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో తోచకపోవచ్చు. ఇలాంటి వారికోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటున్నారు ఫ్యామిలీ అండ్ రిలేషన్‌షిప్ కౌన్సెలర్లు. రొమాన్స్ అనేది ప్రతీ జంటకు ప్రత్యేకమైనదేగాక, వ్యక్తిగతమైనది కాబట్టి జీవితంలో సంతోషంగా ఉండాలంటే పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు.

ఎటువంటి మొహమాటం లేకుండా మీ మనసులోని భావాలను పంచుకోవడం రిలేషన్‌షిప్‌లో పరస్పర అవగాహనకు, మరింత సాన్నిహిత్యానికి దోహదం చేస్తుందని అంటున్నారు.మీ ఫీలింగ్స్‌, కోరికల విషయంలో ప్రత్యేకంగా ఉండాలని చెప్తున్నారు. ఆందోళనలు, భయాలు, అయిష్టతల వెనుక ఉన్న కారణాలను పంచుకునే విషయంలో జంటలు వెనుకాడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. భాగస్వామి సెక్స్ చేయకూడదని మీతో కమ్యూనికేట్ చేస్తే అంగీకరించండి. ఒకవేళ మీరు భావోద్వేగాలను, కోరికలను అణచుకొనే పరిస్థితులు లేకపోతే పూర్తి సెక్స్‌లో పాల్గొనడకుండా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకునే ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి. సెక్స్‌ కోరికలతో మీరు ఆగలేకపోతుంటే ఉద్వేగ భరితమైన ముద్దులతో గడపవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఇంద్రియ లేదా శారీరక స్పర్శతో రొమాన్స్ వల్ల కలిగే ఆనందాన్ని, అనుభూతిని పొందవచ్చని చెప్తున్నారు. టచ్ ఫీలింగ్స్, పరస్పర హస్త ప్రయోగం, ఓరల్ సెక్స్, ఒకరికొకరు మసాజ్ చేసుకోవడం, ఫెదర్-లైట్ టచ్‌లు, సిల్క్ ఫ్యాబ్రిక్స్ లేదా ఐస్ క్యూబ్‌లు వంటి విభిన్న అనుభూతులను అన్వేషించడం ద్వారా మీ క్రియేటివిటీని ప్రదర్శించవచ్చు. వీటితోపాటు వైబ్రేటర్ల నుంచి ఇంద్రియ ఉద్దీపనల వరకు అచ్చం శృంగారంలో పాల్గొన్న అనుభూతి పొందడానికి మార్కెట్లో అవసరమైన అనేక సెక్స్ టాయ్స్ ఉంటాయని, వాటిని కూడా ట్రై చేయవచ్చని నిపుణులు సజెష్ చేస్తున్నారు.

Read more:

సెక్స్‌తో ఆరోగ్య సమస్యలకు చెక్.. వారానికి ఎన్నిసార్లు చేయాలి..?

ఈ కారణంతోనే భార్య పరాయి మగవాడిపై ఆశపడుతుంటారంట?

Advertisement

Next Story