కలలు ఎందుకు రిపీట్ అవుతాయి?

by Aamani |   ( Updated:2023-05-11 14:05:44.0  )
కలలు ఎందుకు రిపీట్ అవుతాయి?
X

దిశ, ఫీచర్స్: చాలా మంది ప్రతి రాత్రి ఒకే కలను కనడం సాధారణం. రోజు వారు ఎదుర్కొనే అనుభవాలు కలల రూపంలో ప్రాసెస్ చేయబడతాయని, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఇలా ఒకే థీమ్‌తో పునరావృతం అవుతాయని నిపుణులు చెప్తుంటారు. ఈ క్రమంలోనే సైకలాజికల్ బేస్డ్ ఎక్స్‌పీరియన్స్, రిపీటెడ్ డ్రీమ్స్ మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రయత్నించిన పరిశోధకులు రెండు విధాలుగా ప్రయోగం నిర్వహించారు. మొదటి అధ్యయనంలో సాధారణ మానసిక అవసరాలు, నిరాశ, దీర్ఘకాలిక అనుభవాలు కలలో ప్రతిబింబించే తీరును అంచనా వేసేందుకు క్రాస్ సెక్షనల్ డిజైన్‌ను ఉపయోగిస్తే.. రెండో అధ్యయనంలో రోజంతా అవసరాల ఆధారిత అనుభవాలు రాత్రి కలలో కనిపిస్తాయా లేదా తెలుసుకునేందుకు డైరీ డిజైన్‌ను వినియోగించింది.

మొదటి అధ్యయనం ఫలితాల ప్రకారం.. జీవితంలో ఎక్కువ మానసిక అసంతృప్తిని అనుభవించిన వారు సాధారణంగా కొంచెం ఎక్కువ ప్రతికూల ఇతివృత్తాలు, అధిక స్థాయి అసహ్యకరమైన భావోద్వేగాలను కలిగి ఉన్న పునరావృత కలలను అనుభవిస్తున్నట్లు నివేదించారు. ఆసక్తికరంగా అవసరాల సంతృప్తి అనేది వ్యక్తులలో సానుకూల కలలు లేదా భావోద్వేగాలకు సంబంధించినదిగా కనుగొనబడలేదు. రెండవ అధ్యయనంలో ప్రజలు చాలా కలత చెందిన రోజుల్లో వారి కలలలో ఎక్కువ ప్రతికూల భావోద్వేగాలను కలిగి ఉన్నట్లు నివేదించారు. అదనంగా జీవితంలో మరింత మానసిక క్షోభను అనుభవిస్తున్న వ్యక్తులు కలలలో మరింత అననుకూల భావాలను గుర్తుచేసుకుంటారు.

పునరావృతమయ్యే కలలను ఎలా ఎదుర్కోవాలి:

* వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడితో కూడిన పరిస్థితులను సులభంగా నిర్వహించడానికి ప్రజలను మానసికంగా స్థితిస్థాపకంగా, మరింత సన్నద్ధం చేస్తుంది. నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. శ్వాస వ్యాయామాలు, ధ్యానం, గైడెడ్ విజువలైజేషన్‌లు వంటివి ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి నిరూపించబడిన రిలాక్సేషన్ పద్ధతులు.

* థెరపీ అండ్ కౌన్సెలింగ్

ఈ కలలు చాలా కాలం పాటు సంభవిస్తే, రహస్యాన్ని ఛేదించడంలో సహాయపడటానికి నిపుణుడితో వాటిని చర్చించడానికి ప్రయత్నించండి. ఇందుకు గల కారణాలను లక్ష్యంగా చేసుకునే ట్రీట్మెంట్స్.. మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాయి.

* మంచి నిద్ర

మంచి నిద్ర దినచర్య పగటిపూట ఉత్పాదకతను పెంచుతుంది. అలసటను తగ్గించి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

ఇలా కల వస్తే మీ అంత అదృష్టవంతుడే ఉండడంట?

Advertisement

Next Story

Most Viewed