రాత్రిపూట ఈ ఆహారాలు తీసుకుంటున్నారా?

by Prasanna |   ( Updated:2023-08-16 14:38:04.0  )
రాత్రిపూట ఈ ఆహారాలు  తీసుకుంటున్నారా?
X

దిశ,వెబ్ డెస్క్: మన పెద్దలు రాత్రిపూట తొందరగా భోజనం చేసి నిద్రపోయేవారు. వారు అలా చేయడం వల్ల ఇప్పటికి ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీలు, ఫంక్షన్స్ అంటూ జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఈ ఆహారాలను తీసుకోకూడదని ఆహార నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

టమాటా

టమాటా,వంకాయలో టెరమైన్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని రాత్రిపూట తీసుకోకండి. వీటిని తినడం వలన మెదడు యాక్టివ్స్ స్టేజ్ లో ఉండి నిద్ర కూడా సరిగా పట్టదు. దాని వలన ఒకటి కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

సిట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ ఫ్రూట్స్ లో ఆసిడిక్ విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రాత్రి సమయంలో తీసుకుంటే దానిలో ఉండే యాసిడ్ విలువలు పెరుగుతాయి.దీని వలన ఎసిడిటీ మరియు గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తిని బాధ పడటం కన్నా తినకుండా ఉండటం మన ఆరోగ్యానికి మంచిది.

Advertisement

Next Story