Ice Age : భూమి.. ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2024-12-13 13:08:08.0  )
Ice Age :  భూమి.. ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మనం భూమిపై నివసిస్తున్నప్పటికీ దాని పుట్టుక, వయస్సు, పరిణామ క్రమాలు, వాటి పర్యవసనాల గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే నిరంతర పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక రహస్యాలను ఛేదించారు. అందులో భాగంగా భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలకంటే ఎక్కువ అని కూడా తేల్చేశారు. కాగా ఒకానొకప్పుడు భూమి ఇప్పుడున్నట్లు కాకుండా ఒక మంచు బతి (Snowball)గా ఉండేదని అడిలైడ్ యూనవర్సిటీకి చెందిన ఆస్ట్రేలియన్ భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

సుమారు 700 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద బాల్ మాదిరి ఉన్న భూమి. అప్పట్లో పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేది. క్రమంగా ష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో జీవరాశి అభివృద్ధి చెందడం ప్రారంభమైందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కాగా అప్పట్లో భూమి ధ్రువాల నుంచి మొదలు కొని భూమధ్యరేఖ వరకు హిమానీనదాలు పూర్తిగా మంచుతో నిండి ఉండేవి. కాబట్టి దానిని మంచుయుగం అని కూడా పిలుస్తారు. ఈ యుగం ప్రాథమికంగా తక్కువ స్థాయి అగ్నిపర్వత కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల వల్ల ఏర్పడింది. ప్రస్తుత కెనడాలోని అగ్నిపర్వత శిలల వాతావరణంతో ఇది కలిసిపోయింది. ఇవి వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి. అయితే మంచు యుగం అనేది డైనోసార్ల యుగం కంటే చాలా ముందున్నకాలమని సైంటిస్టులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed