- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Water: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా?

దిశ, ఫీచర్స్ : మనలో కొందరు భోజనం చేసిన వెంటనే మంచి నీళ్లు తాగుతుంటారు. కానీ, ఇది అంత మంచి పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు. మరి కొందరైతే భోజనం మధ్యలోనే నీళ్లు తాగుతారు. తిన్న తర్వాత నీటిని తాగటం వల్ల మన శరీరానికి కలిగే నష్టాలేంటో ఇక్కడ చూద్దాం..
తిన్న ఆహారం జీర్ణమవ్వడానికి నీళ్లు తాగుతుంటారు. కానీ, ఈ అలవాటు అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. బిజీ లైఫ్ లో తినే సమయంలో కూడా లేకుండా కొందరు కొంచం మాత్రమే తిని నీళ్ళు ఎక్కువగా తాగుతుంటారు. తిన్న ఆహారం జీర్ణం కావాలంటే భోజనం చేసిన 30 నిముషాల తర్వాతే నీళ్లను తీసుకోవాలి. లేదంటే జీర్ణ క్రియ సమస్యలు వస్తాయి.
గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తిన్న వెంటనే నీరు తాగితే ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరికి తిన్నది గొంతులోనే ఉన్నట్టు అనిపిస్తుంది నీళ్లు తాగితే సెట్ అవుతుందని బాటిల్స్ మీద బాటిల్స్ తాగుతుంటారు. దీని వలన ఎసిడిటీ సమస్య ఇంకా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.