watermelon: పాలు, పుచ్చకాయ కలిపి తాగుతున్నారా?

by Prasanna |   ( Updated:2023-04-26 14:45:19.0  )
watermelon: పాలు, పుచ్చకాయ కలిపి తాగుతున్నారా?
X

దిశ, వెబ్ డెస్క్: మనలో కొంతమంది ఆలోచించకుండా కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ తినేస్తుంటారు. తిన్న తర్వాత అనారోగ్యానికి గురవుతుంటారు. వీటిలో సోడా మరియు పిజ్జా, వైన్ మరియు డెజర్ట్, వైట్ బ్రెడ్ మరియు జామ్ మొదలైన కాంబినేషన్స్ తెలియకుండా తినేస్తున్నారు. .వీటిలో మిమ్మల్ని అస్వస్థతకు గురి చేసే ఫుడ్ కాంబినేషన్ పాలు మరియు పుచ్చకాయ. ఈ రెండింటిని కలిపి తాగకూడదట. ఎందుకో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

పుచ్చకాయ అనేది విటమిన్-రిచ్ ఫ్రూట్, ఇది మానవ శరీరంలో సులభంగా జీర్ణమవుతుంది. పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ పనితీరును మెరుగుపరుస్తుందట. పాలలో కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి పాలు , పుచ్చకాయ కలిపి తాగితే పుచ్చకాయలోని ఆమ్లాలు పాలలోని ప్రోటీన్లలో కరిగి, పాలను విచ్ఛిన్నం చేస్తాయి..దీని వల్ల పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి.

Also Read...

వామ్మో.. అక్కడ పుచ్చకాయ ధర రూ. 5 లక్షలు.. స్పెషల్ ఏమిటంటే?

Advertisement

Next Story