- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.. ముఖ్యంగా పురుషులు !!
దిశ, ఫీచర్స్: నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. సమాజంలో పురుషుల సహకారాన్ని, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి విజయాలను ప్రశంసించేందుకు ఈ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళల విజయాలను నిర్వహించేందుకు ఒక రోజు ఉన్నట్లే.. పురుషుల విజయాలు, సహకారాలను గుర్తించడానికి ఒక రోజు ఉంది. కుటుంబం, సమాజం, దేశ నిర్మాణం, అభివృద్ధిలో పురుషుల పాత్ర ముఖ్యమైనది. పురుషుల దినోత్సవాన్ని మానసిక వికాసం, సానుకూల గుణాలు వంటివి లక్ష్యంగా జరుపుకుంటారు. సమాజంపై మగవారు చేసే సానుకూల ప్రభావాన్ని కూడా గుర్తించాలని ఈ ప్రత్యేకమైన రోజు గుర్తుచేస్తుంది.
పురుషులకు సామాజికంగా, మానసికంగా కలిగే ఒత్తిళ్ల గురించి పరిష్కరించేందుకు బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమాజిక సమావేశాలు, బహిరంగ ప్రచారాలు వంటి కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా ఈ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 1992లో ట్రినిడాడ్‌కు చెందిన డాక్టర్ జెరోమ్ టీలక్సింగ్ ప్రారంభించారు. మహిళల విజయాలు మాత్రమే కాకుండా పురుషుల విజయాలు, వారి సహకారాలను గుర్తించడానికి ఈ రోజును అంకితం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ రోజును నిర్వహించుకుంటారు.
సాధారణంగా మహిళలే ఎక్కువగా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని అనుకుంటారు. కానీ, వారి కంటే పురుషులే ఎక్కువగా మానసిక వేదనను అనుభవిస్తారు. పురుషులు తమ సమస్యలను బయటకు చెప్పుకోలేరు. సమాజంలోని వారు ఏమనుకుంటారా అనే ఆలోచనతో వారి సమస్యలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు. దీని వల్ల పురుషులలో ఎక్కువగా కోపం, ఆందోళన, ఇతరులను దోషించడం లాంటివి కనిపిస్తాయి. వీటిని ఎదుర్కొనెందుకు కొన్ని విషయాలపై దృష్టి సారించాలి. మానసిక ఆరోగ్యం మెరుగుపడడం కోసం ధ్యానం చేయడం మంచిది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.
పురుషులు ఏదైనా హాబీని అలవాటుచేసుకోవాలి. ట్రెక్కింగ్, వంటపని, వర్కౌట్స్, పుస్తకాలు చదవడం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ప్రతీ రోజు దానిపై దృష్టి పెడితే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇలా మనసుకు నచ్చిన దానిని హాబీగా మార్చుకుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతీ రోజు ఆహారంలో భాగంగా పోషకాలు ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం మంచిది. పండ్లు, కాయగూరలు తినడం అలవాటు చేసుకుంటే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరకంగా దృఢంగా ఉంటారు.