ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దట!

by sudharani |
ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దట!
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇంట్లో దీపం పెట్టుకోవడం చాలా మంచిది. ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీలు దూరమై పాజిటివిటీ వస్తుందని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో నిత్యం పూజలు చేస్తుంటారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం దీపం పెట్టేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం..

* దీపం వెలిగించే ముందు కుందులు శుభ్రంగా ఉండటం ముఖ్యం. శుభ్రం చేయకుండా పెడితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.

* ఇంటిని శుభ్ర పరిచిన తర్వాత మాత్రమే ఇంట్లో దీపం పెట్టాలి.

* అంతే కాకుండా దీపం పెట్టే ముందు ఇంట్లో గంగాజలం జల్లితే ఇంకా మంచిది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

* ఇంటి ముఖ ద్వారం వద్ద సాయంత్రం పూట కూడా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.

* దీపాన్ని వెలిగించే ముందు కుందుల కింద చిన్న ప్లేట్‌ను అమర్చుకోవాలి. డైరెక్ట్‌గా నేల మీదా పెట్టి దీపం వెలిగిస్తే మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

* దీపం కింద తమలపాకు పెట్టి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది అంటున్నారు పండితులు. దీని ద్వారా సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed