- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Health tips : అతిగా నిద్రపోతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే?
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర అవసరమే కానీ అతినిద్ర అనారోగ్యానికి కారణం అవుతందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే.. తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్ర హైపర్ సోమ్నియాతో బాధపడుతున్నారనేందుకు సంకేతమని వివరిస్తున్నారు. ఇది శరీరం, మనసుపై దీర్ఘకాలిక చెడు ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్న నిపుణులు.. అతినిద్రకు కారణాలు, నియంత్రణకు సూపర్ ఎఫెక్టివ్ టిప్స్ అందిస్తున్నారు.
ఎంత నిద్ర అవసరం?
ఆరోగ్యకరమైన శరీరానికి ఎన్ని గంటల పాటు నిద్ర అవసరమనేది చర్చనీయాంశం కాగా వయసును బట్టి నిద్ర అవసరాలు ఉంటాయని తెలిపింది తాజా అధ్యయనం. ఇంతకు మించి నిద్రపోతే ఓవర్‌స్లీపింగ్ కండిషన్స్‌తో బాధపడుతున్నట్లేనని స్పష్టం చేసింది.
* 0-3 months – 14 to 17 hours
* 4-11 months -12 to 15 hours
* 1-2 years – 11 to 14 hours
* 3-5 years – 10 to 13 hours
* 6-13 years – 9 to 11 hours
* 14-17 years – 8 to 10 hours
* 18-64 years – 7 to 9 hours
* Over 65 years- 7 to 8 hours
అతినిద్రకు కారణాలు :
* రాత్రికి సరిపడా నిద్ర పట్టకపోవడం: రాత్రి షిఫ్టులో పనిచేయడం, టీవీ చూడటం లేదా అర్థరాత్రి చదవడం మొదలైనవి హైపర్సోమ్నియాకు దారితీయవచ్చు.
* వాతావరణం కారణంగా: వింటర్ సీజన్‌లో చలి కారణంగా రాత్రిపూట పదేపదే నిద్రకు ఆటంకం కలుగుతుంది. వేసవి కాలంలో కూడా అదే జరుగుతుంది. గాఢ నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు నిద్రలేమి అనుభూతి కలుగుతుంది.
*ఆందోళన లేదా ఒత్తిడి: కొందరు వ్యక్తులు ఒత్తిడి కారణంగా రాత్రి సరిగ్గా నిద్రపోక, మరుసటి రోజు అలసిపోతారు. ఆరోగ్యకరమైన నిద్ర రాత్రి పూట మాత్రమే పొందగలం.
*మందులు తీసుకోవడం: అలర్జీ అండ్ స్లీపింగ్ మెడిసిన్ తీసుకోవడం నిద్ర విధానాలను ప్రభావితం చేస్తుంది.
*ఆల్కహాల్ తీసుకోవడం: అతిగా నిద్రపోవడానికి ఆల్కహాల్ తీసుకోవడం కూడా ఒక కారణం కావచ్చు.
*కెఫిన్ కలిగిన పానీయాలు: టీ అండ్ కాఫీ.. స్లీపింగ్ సైకిల్‌పై ప్రభావం చూపుతాయి. అతిగా నిద్రపోవడానికి ఇవి కూడా కారణం కావచ్చు.
*తీవ్రమైన అనారోగ్యం ఉండటం: రాత్రిపూట ఆస్తమా, హైపోథైరాయిడ్, ఎసోఫాగియల్ రిఫ్లక్స్ మొదలైనవి హైపర్సోమ్నియాకు కారణమవుతాయి.
*స్లీప్ డిజార్డర్స్: రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్, స్లీప్ అప్నియా, స్లీప్ వాకింగ్, ఒత్తిడి మొదలైనవి నిద్రా విధానాలకు భంగం కలిగిస్తాయి.
ఓవర్ స్లీపింగ్ కండిషన్స్:
* నార్కోలెప్సీ టైప్-1: నార్కోలెప్సీ టైప్-1 అనేది ఒక రకమైన నిద్ర రుగ్మత కాగా ఇది నిద్ర విధానాలను ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట తగినంత నిద్ర ఉన్నా కూడా పగటిపూట అతిగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. మెదడులో ఉండే హైపోథాలమిక్ హైపోక్రెటిన్ న్యూరాన్స్ తగ్గడం లేదా కాటాప్లెక్సీ(కండరాల హీనత లేదా పక్షవాతం వలన కలిగే పరిస్థితి) వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
* నార్కోలెప్సీ టైప్-2: ఇది కూడా ఒక రకమైన హైపర్సోమ్నియా. ఇది సాధారణంగా కౌమారదశలో కనిపిస్తుంది. నార్కోలెప్సీ టైప్-1 లాగానే, ఈ స్థితి కూడా నిరంతరం నిద్రకు దారితీస్తుంది. ఇది కేవలం కాటాప్లెక్సీ సమస్య కాదు. కాబట్టి దీనిని నార్కోలెప్సీ టైప్ 1 యొక్క మొదటి దశగా కూడా పరిగణించవచ్చు. దీంతో బాధపడేవారు పగటిపూట నిద్రపోవడం ద్వారా రిఫ్రెష్‌గా ఫీల్ అవుతారు.
* ఇడియోపతిక్ హైపర్సోమ్నియా: ఇడియోపతిక్ హైపర్సోమ్నియా ఉన్నవారు కూడా రాత్రికి తగినంత నిద్రపోతున్నప్పటికీ రోజంతా నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. దీంతో బాధపడుతున్న వ్యక్తులకు స్లీపింగ్ సైకిల్‌పై పూర్తిగా నియంత్రణ ఉండదు. ఎంత నిద్రపోయినా సరే రిఫ్రెషింగ్ అనుభూతి పొందలేరు.
* క్లీన్-లెవిన్ సిండ్రోమ్: ఇది కూడా ఒక రకమైన హైపర్ సోమ్నియా కాగా చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రధానంగా ఈ వ్యాధి కౌమారదశలో ఉన్న పురుషులను ప్రభావితం చేస్తుంది. దీనితో బాధపడుతున్న వ్యక్తులు వరుసగా 20 గంటలు నిద్రపోతారు. కేవలం తినడానికి మాత్రమే సమయం కేటాయించి మళ్లీ నిద్రపోతారు. ఈ పరిస్థితి కొన్ని వారాలు లేదా నెలలపాటు ఇబ్బందికరంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం అభిజ్ఞా, బిహేవియరల్, మెంటల్ కండిషన్స్‌కు సంబంధించిన ఆటంకాలను పరిగణించవచ్చు.
అతి నిద్ర అధిగమించేందుకు మార్గాలు:
* కాఫీ: అతినిద్రతో పోరాడటానికి కాఫీ మంచి పరిష్కారం. NCBI (నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్) పరిశోధన ప్రకారం, కాఫీలో ఉండే కెఫిన్ నేరుగా మెదడు వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీని పెంచుతుంది. ఇది అలసట, నిద్ర నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
* నీరు: తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో అలసట ఏర్పడి ఏకాగ్రత కోల్పోయేలా చేస్తుంది. అన్ని వేళలా నిద్రకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో రోజంతా తగినంత నీరు త్రాగటం ప్రయోజనకరంగా ఉంటుంది.
* వ్యాయామం: హైపర్ సోమ్నియాకు ప్రధాన కారణాలలో స్థూలకాయం ఒకటి. అటువంటి పరిస్థితిలో, హైపర్ సోమ్నియాతో బాధపడుతున్న వ్యక్తి రోజూ 30 నిమిషాల నుంచి గంట వరకు వ్యాయామం చేయాలి. తద్వారా బరువును అదుపులో ఉంచుకోవడంతో వ్యక్తి రిఫ్రెష్‌గా ఫీల్ అయ్యే అవకాశముంది.
* షవర్: శరీరం అలసిపోయినట్లు అనిపించినప్పుడు, నిద్ర రావడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, స్నానం చేయడం సహాయకరంగా మారుతుంది. స్నానం చేయడం వల్ల మూడ్ రిఫ్రెష్ అయి, యాక్టివ్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. అందుకే తలస్నానం చేయడం వల్ల ఎక్కువ నిద్రపోవడం ద్వారా కలిగే అలసట నుండి కొంత ఉపశమనం పొందవచ్చు.
* స్మాల్ న్యాప్ : నిద్ర వచ్చినప్పుడు కాసేపు నిద్రపోవడం కూడా నిద్రకు దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిజానికి, నిద్రలేమిని తొలగించడంతో పాటు బద్ధకం మరియు మగతను తొలగించడంలో ఒక చిన్న న్యాప్ సహాయపడుతుంది. ఇది జ్ఞాపకశక్తికి పదును పెట్టడంతోపాటు పని సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి ప్రయోజనాలను అందించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
- Tags
- health tips