ఆ దేశంలో మంగళవారం పెళ్లి చేసుకోరట.. ఎందుకో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-06-11 13:49:17.0  )
ఆ దేశంలో మంగళవారం పెళ్లి చేసుకోరట.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో కూడా కొందరు మూఢ నమ్మకాలను బాగా నమ్ముతుంటారు. మరి కొందరు ఏంటి నమ్మేదని కొట్టి పారేస్తుంటారు? కొన్ని దేశాలలో అయితే వీటిని నమ్మడమే కాకుండా పాటిస్తారు కూడా.. వాటిలో మూడింటి గురించి ఇక్కడ చూద్దాం

1. లాటిన్ అమెరికా దేశాల్లో మంగళవారం అసలు పెళ్లి చేసుకోరు.ఇలా చేసుకున్న రోజు నుంచి గొడవలు పడుతూనే ఉంటారట. అలాగే కొద్దీ కాలం కూడా కాపురం చేయకుండా విడాకులు తీసేసుకుంటారని అక్కడి వాళ్లు నమ్ముతుంటారు. ఆ రోజు ఎవరైన పెళ్లి చేసుకున్నా.. ఏదొక కారణం చెప్పి వెళ్లకుండా ఉంటారట.

2. వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు ఏమి చేస్తాం.. గొడుగు తీసుకొని వెళ్తుంటాం. కొందరు ఇంట్లో ఉండగానే గొడుగు తెరుచుకొని బయటకు వెళ్తుంటారు. అలా ఇంట్లో ఉండగానే గొడుగు తెరిస్తే దురదృష్టమట.

3. ఆఫ్రికా దేశం రువాండాలో మహిళలు మేక మాంసం ఎక్కువగా తినరట. అలా తింటే ముఖంపై వెంట్రుకలు బాగా వస్తాయని నమ్ముతుంటారట.

Read more:ఎన్టీఆర్‌ను ఫాలో అయిన బాలయ్య తనయుడు.. సర్జరీ చేయించుకున్నాడా?

దెయ్యాలు, ఆత్మలు కొంత మందికే ఎందుకు కనిపిస్తాయో తెలుసా?

Advertisement

Next Story