- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెండో శనివారం సెలవు ఎందుకు ఇస్తారో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్ : రెండో శనివారం అంటే చాలా చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే సెండ్ శాటర్ డే, అలాగే సండే రెండు రోజులు సెలవులు కలిసి వస్తాయి.అందుకే, విద్యార్థులు , పలు ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు రెండో శనివారం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే రెండో శని వారం సెలవు అని చాలా సంతోషంతో ఇంటికి వెళ్తారు కానీ, అసలు రెండో శని వారం సెలవు ఎందుకు ప్రకటించారు? అనేదానిపైన చాలా మందికి అవగాహన ఉండదు. కాగా, అసలు రెండో శని వారం ఎందుకు సెలవుదినంగా ప్రకటించారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియాలో రెండో శనివారం సెలవు ఇవ్వడం వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉన్నదంట. అదేమిటంటే? 19వ శతాబద్దంలో బ్రిటిష్ ఆఫీసర్ వద్ద చాలా నిజాయితీగా పనిచేసే సహాయకుడు ఉండేవాడట. అతను సెలవు దినాల్లో మాత్రమే తన తల్లిదండ్రులను కలవడానికి తన గ్రామానికి వెళ్లేవాడట.
అయితే కొన్ని రోజుల తర్వాత తనకు బాధ్యతలు పెరగడంతో, ఇంటికి వెళ్లడం మానేశాడంట. అలాగే అతనికి సెలవు దినాలు కూడా తగ్గిపోయాయంట. దీంతో కొడుకు మీద ఉన్న ప్రేమతో, తల్లిదండ్రులు తన కుమారుడిని చూడటానికి , అలాగే తమ కొడుకుకి సెలవు ఇచ్చి తమతో పంపమని అడగటానికి వారు బ్రిటీష్ అధికారి వద్దకు వెళ్లారట.
తన దగ్గర పనిచేసే సహాయకుడికి తల్లిదండ్రులను కలవడానికి కూడా సమయం దొరకట్లేదన్న విషయం అప్పుడు ఆ బ్రిటీష్ అధికారికి తెలిసిందట. తన వద్ద ఎంతో నిబద్ధతగా, నిజాయితీగా పని చేస్తున్న సహాయకుడిని చూసి అతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడట. ఇక అప్పటి నుంచి ప్రతి నెల రెండవ శనివారం సెలవు దినంగా ప్రకటించారట. బ్రిటీష్ ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించింది. అలా అప్పటి నుంచి ఇండియాలో కొన్ని విభాగాలలో పనిచేసే వారికి రెండో శనివారం సెలవు ఇస్తున్నారు.