ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనాలు ఏవో తెలుసా..

by Sumithra |
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనాలు ఏవో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచంలో ఎన్నో అందంగా, ఆకర్షణీయంగా ఉండే ప్రకృతి సోయగాలు ఉన్నాయి. ఆ అందమైన ప్రపంచంలో మానవులు తమ కళ, సృజనాత్మకతను ఉపయోగించి అద్భుతమైన కళాఖండాలను, భవనాలను సృష్టించారు. ఇంతటి అద్భుతమైన కళాఖండాలను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది పర్యాటకులు ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. మీలో ఎవరైన అందమైన ప్రదేశాలను చూడాలనుకుంటే ఈ అందమైన భవనాలను చూడటం మాత్రం మిస్ కాకండి. ఇంతకీ ఆ భవనాలు ఎక్కడ ఉన్నాయి వాటి వివరాలను మనం తెలుసుకుందాం..


మెరీనా బే సాండ్స్

సింగపూర్‌లో నిర్మించిన అద్భుతమైన కట్టడాల్లో ఒకటే మెరీనా బే సాండ్స్. ఈ భవనంలో 2,561 గదులు, 120,000 చదరపు మీటర్ కన్వెన్షన్ ఎగ్జిబిషన్ సెంటర్ ఉన్నాయి. ఈ భవనంలోనే ఒక థియేటర్, మ్యూజియం, "సెలబ్రిటీ చెఫ్" రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే ఆర్ట్-సైన్స్ ఎగ్జిబిట్‌లు, తేలియాడే రెండు క్రిస్టల్ పెవిలియన్లు, 500 టేబుల్స్ ఉన్నాయి. అంతే కాదు ఈ భవనంలో సాండ్స్ స్కై పార్క్ పైన మూడు టవర్లను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ కాంటిలివర్డ్ పైన సెట్ చేయబడింది. 3,902 మంది వ్యక్తుల సామర్థ్యంతో స్కైవే, 150 మీటర్ల స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ కాంటిలివర్ ఎగువన ఉంది.


సిడ్నీ ఒపెరా హౌస్

ప్రపంచంలోని అత్యుత్తమ భవనాలలో సిడ్నీ ఒపెరా హౌస్ ఒకటి. ఇది న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియాలో బహుళ వేదికల ప్రదర్శన కళల కేంద్రం. సిడ్నీ నౌకాశ్రయం ముందు ఒడ్డు పై ఉన్న ఈ భవనం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన భవనాలలో ఒకటి.


టైగర్ నెస్ట్ భూటాన్

భారతదేశానికి పొరుగు దేశం భూటాన్. ఇక్కడ మంచు పర్వతాల నుండి ప్రశాంతమైన బౌద్ధ విహారాలు, దట్టమైన అడవులు, పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, పర్యావరణం మీ మనస్సును ప్రశాంతంగా, రిఫ్రెష్‌గా మారుస్తాయి. భూటాన్‌లోని అత్యంత ప్రసిద్ధ మఠాలలో ఒకటి టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ. ఇక్కడ గురురింపోచే మొదటిసారి ధ్యానం చేసినట్లు చెబుతారు. గురురింపోచే పులిపై స్వారీ చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడని చెబుతారు. అందుకే ఈ మఠానికి 'టైగర్ నెస్ట్' అని పేరు పెట్టారు.


హవా మహల్ జైపూర్

భారతదేశంలోని జైపూర్ హవా మహల్ ను 1799లో మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ రాజస్థాన్, జైపూర్‌లోని బడి చౌపర్‌లో నిర్మించారు. ఈ భవనంలో 953 ఆకర్షణీయమైన చిన్న జాలీ కిటికీలను కలిగి ఉంది. వీటిని జరోఖా అని పిలుస్తారు.


వెస్ట్ మిన్‌స్టర్

వెస్ట్‌మిన్‌స్టర్ లండన్ థేమ్స్ నది నుండి ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్ వరకు విస్తరించి ఉంది. వెస్ట్‌మిన్‌స్టర్ ప్యాలెస్, బకింగ్‌హామ్ ప్యాలెస్, వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే, వెస్ట్‌మిన్‌స్టర్ కేథడ్రల్, ట్రఫాల్గర్ స్క్వేర్, వెస్ట్ ఎండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్‌తో సహా వెస్ట్ ఎండ్ కల్చరల్ సెంటర్‌తో అనేక ప్రసిద్ధ మైలురాళ్లను కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed