టీ సూపర్ టేస్ట్ రావాలంటే ఏం చేయాలో తెలుసా?

by Jakkula Samataha |
టీ సూపర్ టేస్ట్ రావాలంటే ఏం చేయాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఉదయం టీ తాగడానికి ఎవరు ఇష్టపడరు. చాలా మంది ఛాయ్ తాగడం ఇష్టం. ఇక కొంత మంది అల్లంట టీ, ఇంకొంత మంది ఇలాచీ టీ, మసాలా టీ ఇలా ఒక్కొక్కటి ఇష్టపడుతుంటారు.ఇక ఆఫీసుల్లో వర్క్ చేసే వారైతే రోజు రెండు లేదా మూడుసార్లు టీ తాగుతూ ఉంటారు. అయితే టీ రుచిగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకాస్త తాగితే బాగుండు అనే విధంగా ఉంటుంది. కానీ మనం టీ తయారు చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేసి టీ రుచిని పాడు చేస్తాము.

అయితే టీ చేసే ముందు ముందు కొన్ని టిప్స్ పాటిస్తే.. టేస్టీగా ఉంటే టీ రెడీ అవుతుందంట. అయితే దీని కోసం ఇలా చేయాలంట. ముందుగా వేడి చేసిన పాలను టీకి ఉపయోగించాలి. ఆతర్వాత మరుగుతున్న పాలలో టీ పౌడర్, అల్లం పొడి వేసి మరిగించాలి. ఆ తర్వాత షుగర్ వేసి మరికొద్ది సేపు టీని మరగ బెట్టాలి. ఇలా రెండు లేదా మూడు నిమిషాలు టీ మరిగితే చాలు. టీ సూపర్ టేస్ట్ ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి.

Advertisement

Next Story

Most Viewed