కలలో వెలిగించిన దీపం చూస్తే ఏమౌతుందో తెలుసా?

by samatah |   ( Updated:2023-02-24 14:32:02.0  )
కలలో వెలిగించిన దీపం చూస్తే ఏమౌతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కలలు రావడం అనేది సహజం. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కలులు అనేక రకాలు ఉంటాయి. పగటి కలలు, రాత్రి వేళ వచ్చే కలలు, వేకువజామునే వచ్చే కలలు. ఇలా ఒక్కో సమయంలో కలలు వస్తుంటాయి. కొన్ని కలలు శుభఫలితాలను ఇస్తే మరి కొన్ని కలలు అశుభ ఫలితాలను ఇస్తాయి.అయితే కొంత మంది తమ ఆలోచనలప్రకారం కలలు కంటారు. అయితే వాటికి వాస్తవానికి సంబంధం ఉండదు.

కానీ కలలో కొన్ని రకాల వస్తువులు లేదా జంతువులు, పక్షులు కనిపిస్తే చాలా మంచిది, కొన్ని కనిపిస్తే చెడు జరిగే అవకాశాలు ఉంటాయి అంటుటారు. కాగా, కలలో వెలిగించిన దీపం కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అరిపోయే దీపం కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

స్వప్నశాస్త్రం ప్రకారం మీరు కలలో దీపం వెలగించడం చూస్తే అది చాలా శుభ సూచకం అంట. దాని వలన మీరు భవిష్యత్తులో పొందబోయే ప్రయోజనాలను సూచిస్తుందంట. ఒక వేళ బ్యాచిలర్స్ అయితే భాగస్వామిని పొందే అవకాశం ఉంటుందంట.

ఒక వేళ మీరు కలలో గనుక అరిపోయిన దీపం చూస్తే అది మంచి సంకేతం కాదు అంటున్నారు. స్వప్న శాస్త్ర నిపుణులు. మీరు మీ జీవితంలో డబ్బునష్టం చూసే అవకాశం ఉంటుందంట.

ఇవి కూడా చదవండి:

నిర్ణయం బ్రెయిన్‌దే..!! ఏం ఆలోచించాలో డిసైడ్ చేస్తున్న మెదడు

Advertisement

Next Story

Most Viewed