Flight : ఆకాశంలో విమానం వెళ్తుంటే దానిపై పిడుగు పడుతుందా? పడితే ఏం జరుగుతుందో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-07-26 15:08:55.0  )
Flight : ఆకాశంలో విమానం వెళ్తుంటే దానిపై పిడుగు పడుతుందా? పడితే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : వర్షం పడినప్పుడు మెరుపులు రావడం, పిడుగులు పడటం అనేది చాలా కామన్. అయితే ఆకాశంలో పక్షులు తిరుగుతూ ఉంటాయి. కానీ వర్షం స్టార్ట్ అయితే చాలు అవి చెట్ల మీదకు చేరుకుంటాయి. అయితే కొన్ని సార్లు ఫ్లైట్ వర్షంలో కూడా వెళ్లాల్సి వస్తుంది. అయితే అలాంటి సమయంలో విమానాల మీద పిడుగు పడితే ఎలా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

సాధారణంగా పిడుగులు పడే సిట్యువేషన్ రాదు. టైమ్ మ్యాగజైన్ వార్త ప్రకారం పిడుగు కారణంగా విమానం ప్రమాదానికి గురైన చివరి సంఘటన 1967లో జరిగిందంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగనట్లు సమాచారం. ఒక వేళ అలాంటి పరిస్థితులు ఎదురైనా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని విమానాలను పిడుగులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారంట. ముఖ్యంగా మోడర్న్ ప్లేన్స్ తయారు చేయడానికి లోహాలతో పాటు,కార్బన్ ఫైర్ వంటి స్ట్రాంగ్ లైట్ వేయిట్ మెటిరియల్స్ ఉపయోగిస్తున్నారంట. ఇవి చెక్క, ప్లాస్టిక్, రబ్బర్ లా పని చేస్తాయి.ఇవి విద్యుత్‌ను అంతగా ప్రసారం చేయవు. దీని వలన పిడుగు పడినా విమానానికి అందులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. పిడుగు ఆ లోహాపు దాన్ని తాకి వెళ్లిపోతుంది. దీని వలన విమానంలో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగదు, అసలు పిడుగు పడినట్లే తెలియదంట. అందు వలన పిడుగుల వలన ఫ్లైట్ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం భయం ఉండదు. అంతే కాకుండా ప్రస్తుతం పైలెట్స్‌కు కూడా వర్షాకాలంలో పిడుగులు లాంటి సమస్యలు ఎలా ఎదుర్కోవాలో ట్రైనింగ్ ఇస్తున్నారంట. అందువలన ఫ్లైట్ పై పిడుగు పడుతుంది అనే భయం అవసరం లేదంట.

Read More..

Bathroom Geyser: బాత్రూంలోని గీజర్లు వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్న నిపుణులు

Advertisement

Next Story

Most Viewed