చికెన్ వారంలో 4 సార్ల కంటే ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-28 07:05:23.0  )
చికెన్ వారంలో 4 సార్ల కంటే ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో నాన్ వెజ్ ఇష్టపడని వారంటూ ఉండరు. ముఖ్యంగా వాటిలో చికెన్ ఎక్కువ మంది తింటుంటారు. చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలను కూడా తింటూ ఉంటారు. చికెన్ కబాబ్, చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ, చికెన్ 65 ఇలా చేసుకుని తింటాము. కొంత మంది వారంలో కనీసం 4 సార్లు చికెన్ తింటారు. మరి కొంతమందైతే ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు తింటారు. కానీ ఇలా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. చికెన్ ఎక్కువ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో ఇక్కడ చూద్దాం..

చికెన్‌ పై సాల్మొనెల్లా, క్యాంపీలోబాక్టెర్‌ బ్యాక్టీరియా ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకువచ్చిన రెండు మూడు గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టి కొద్దికొద్దిగా వండుకుంటే బ్యాక్టీరియా పెరిగి పాయిజనింగ్‌ అవుతుంది. దీని వల్ల డయేరియా, నిమోనియా, ఊపిరి తిత్తుల సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ చికెన్‌ తీసుకుంటే బరువు పెరుగుతారు. ఎందుకంటే చికెన్‌లో ప్రోటీన్‌ ఎక్కవగా ఉంటుంది. శరీరం బర్న్‌ చేయలేని ప్రొటిన్‌ కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. కాబట్టి చికెన్ ఎప్పుడు తిన్నా గ్రేవీలా చేసుకొని తినడం చాలా మంచిది.

Read More:

తెలుపు వెన్న తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి?

పసుపు పాలను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Advertisement

Next Story