అలాంటి కలలు వస్తే పెళ్లి ఘడియలు దగ్గర పడ్డట్లే..! స్వప్న శాస్త్రం చెబుతుంది ఇదే..!!

by Sumithra |   ( Updated:2023-06-29 09:13:51.0  )
అలాంటి కలలు వస్తే పెళ్లి ఘడియలు దగ్గర పడ్డట్లే..! స్వప్న శాస్త్రం చెబుతుంది ఇదే..!!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి మనిషి నిద్రపోతున్న సమయంలో ఎన్నో కలలు కంటారు. కలలో నీళ్లు, చెట్లు, జంతువులు, ఆలయాలు, ముత్తైదువులు, చిన్నపిల్లలు ఇలా ఒక్కటేమిటి వస్తువులు, మనుషులు, జంతువులు అన్న తేడా లేకుండా అన్ని కలలో కనిపిస్తాయి. వాటిలో కొన్ని శుభసంకేతాలు అయితే మరికొన్ని అశుభానికి సంకేతాలు. మరికొందరికి నిజ జీవితంలో జరిగిన, జరిగే ఘటనలే కలలుగా వస్తుంటాయి. మనకి నిద్రలో వచ్చే కలలను బట్టి భవిష్యత్తును అంచనా వేయవచ్చు అంటుంది స్వప్న శాస్త్రం. కొన్ని కలలను బట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. అలాగే యుక్త వయస్సులో ఉండే యువతీయువకులకు వచ్చే కలలను బట్టి వారి కళ్యాణ ఘడియలు చేరువలో ఉన్నట్టు తెలుసుకోవచ్చు. వివాహఘడియలను చెప్పే ఈ ఆ కలలు ఏంటో ఇప్పుడు తెలుకుందాం..

కలలో తల్లిదండ్రులు ఇద్దరూ ఆనందంగా కలిసి కనిపిస్తే అది శుభసూచకం. ఇలాంటి కలలు యువతీయువకుల వివాహా ఘడియలు వస్తున్నట్టు సూచిస్తుంది. అలాగే కలలో ఉంగరం ధరించినట్లు కనిపిస్తే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తితో వివాహం జరుగుతుందని అర్థం. కలలో కొత్త చెప్పులు కొన్నా, ధరించినట్టు కనిపించిన వివాహఘడియలు దగ్గరపడినట్లు స్వప్న శాస్త్రం చెబుతోంది. అలాగే అడవిలో ఒంటరిగా లేదా ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో నడుస్తున్నా, ప్రకృతిని ఆస్వాధించినా, ఏదైనా జాతర జరిగి ఆ జాతరకు వెళ్లినట్లు కనిపించినా, దుస్తులపై అందంగా ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ కనిపించినా, జుట్టు దువ్వుకున్నా, జుట్టు సరి చేసుకుంటున్నట్లు కనిపించినా, గడ్డం నిమురుతున్నట్లు కనిపించినా, రైలులో ప్రయాణం చేస్తున్నట్లు కనిపించినా త్వరలోనే కళ్యాణ ఘడియలు మొదలవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది.

Read More: Anger Management : కోపం ఎక్కువగా వస్తుందా..అయితే వీటిని తప్పక వాడాల్సిందే

Advertisement

Next Story

Most Viewed