Pumpkin seeds: గుమ్మడి విత్తనాల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలేవో తెలుసా..?

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-12-11 15:32:30.0  )
Pumpkin seeds: గుమ్మడి విత్తనాల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలేవో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: గుమ్మడి కాయతో చాలామంది కూర లేదా స్వీట్ చేసుకుంటారు. కానీ, దాని గింజల్ని మాత్రం పక్కన పడేస్తుంటారు. నిజానికి ఈ సీడ్స్ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు.. పినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. వీటని తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె సమస్యలను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చదివేయండి.

గుమ్మడి గింజలను తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు అధికమవుతాయి. నాడీ వ్యవస్థ తీరును మెరుగుపరుస్తుంది. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. ఇది షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది. వీటిని నేరుగా తినలేని వారు రోస్ట్ చేసుకోని గాని సలాడ్, సూప్‌లపై చల్లుకుని తీనవచ్చు.

నిద్ర సమస్య: గుమ్మడి విత్తనాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని మెలటోన్‌ ఉత్పత్తిని అధికం చేసి, నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులోని విటమిన్ ఇ.. ఫ్రీ రాగడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. వీటిని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గించుకోవచ్చు.

ప్రోస్టేట్ గ్రంధి ఆరోగ్యానికి: గుమ్మడి విత్తనాల్లో పోషకాలు సంమృద్ధిగా ఉంటాయి. ఇందులో అధికంగా ఉండే జింక్ ప్రోస్టేట్‌‌ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. గుమ్మడి విత్తనాలను తరచుగా తినడం వల్ల బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్టేసియా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మూత్రాశయం ఇన్‌ఫెక్షన్లలు రాకుండా నివారిస్తుంది.

గుండె ఆరోగ్యానికి: గుమ్మడి గింజలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఈ సీడ్స్ తినడం వల్ల గుండె రక్త నాళాల్లో గడ్డలు రాకుండా నివారిస్తుంది. ఇది షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. వీటిని రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్య నుంచి రక్షిస్తుంది. గుమ్మడి విత్తనాల్లోని మెగ్నీషియం, బీపీని నియంత్రించడంతోపాటుగా, శరీరంలోని వాపులను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

మెనోపాజ్: క్రమం తప్పకుండా పీరియడ్స్ వచ్చి ఆగిపోయే టైమ్ మెనోపాజ్. ఇది సాధారణంగా 40 నుండి 50 ఏళ్ల మహిళలకు జరుగుతుంది. ఇటువంటి సమయంలో మహిళల్లో శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, మైగ్రేన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ టైమ్‌లో ఈ గుమ్మడి గింజలను తినడం వల్ల ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజన్ మెనోపాజ్ లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Effects of vitamin D in Pregnancy: విటమిన్ డి లోపం వల్ల ప్రెగ్నెన్సీ రాదా..?




Advertisement

Next Story