- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత దేశంలో మొట్టమొదటగా ప్రసారమైన సీరియల్ ఏదో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటి, వంటపనులు కూడా మానేసి గృహిణులు సీరియల్స్‌లో లీనమైపోతున్నారు. కొంత మంది మహిళలైతే తన చుట్టూ ఏం జరుగుందో అని కూడా గమనించకుండా టీవీలకు అతుక్కుపోతున్నారు. అంతటితోనే వదిలేయక మరుసటి రోజున కాలనీల్లో ఉండే అమ్మలక్కలంతా కలిసి సీరియల్స్‌పై చర్చావేధికలు పెడుతుంటారు. మళ్లీ ఆ రోజున సీరియల్‌లో ఏం జరుగుతుందో అని సాయంకాలం వరకు ఎదురుచూస్తారు. సీరియల్స్‌లో విషాదకరమైన ఎపిసోడ్ ప్రసారం అయితే చాలు కొంత మంది వారి ఇంట్లో సమస్యలాగా బాధపడతారు. మరికొంత మంది మహిళలు సీరియల్ శుభకార్యాలు జరిగితే వారింట్లో జరిగినట్టు సంబరపడతారు. ఒక్కో సీరియల్ వేల ఎపిసోడ్లు ప్రసారం అయినా ఎంతో ఓపికగా చూస్తారు. మరి మహిళలందరినీ ఇంతగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి. మన భారత దేశంలో మొట్టమొదటి సీరియల్ ఏది, ఎన్ని ఎపిసోడ్స్‌తో ముగిసిందో తెలుసా..?
భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ డ్రామా (సీరియల్) హమ్ లోగ్ అనే హిందీ సీరియల్. మనోహర్ శ్యామ్ జోషి రచించిన ఈ సీరియల్‌కు పి.కుమార్ వాసుదేవ్ దర్శకత్వం వహించారు. వినోద్ నాగ్‌పాల్, జయశ్రీ అరోరా, రాజేష్ పూరి, అభినవ్ చతుర్వేది, సీమా భార్గవ, దివ్య సేథ్, సుష్మా సేథ్, అనిల్ బిస్వాస్‌లు ఈ ధారావాహికలో నటించారు. ఈ సీరియల్ 1984-85లో ప్రసారం అయ్యింది. ఈ సీరియల్ 154 ఎపిసోడ్‌లతో ముగిసింది. ఇది ముగిసిన సమయంలో భారతీయ టెలివిజన్ చరిత్రలోనే సుదీర్ఘంగా నడుస్తున్న సీరియల్‌గా చెప్పొచ్చు. ఈ సీరియల్‌ను 60 మిలియన్ల ప్రేక్షకులు ఆదరించారు. ఈ ధారావాహిక ప్రతి ఎపిసోడ్ సుమారుగా 25 నిమిషాల నిడివితో ప్రసారం అయ్యేది. ఇక చివరి ఎపిసోడ్ మాత్రం 55 నిమిషాల పాటు ప్రసారం అయ్యి ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తరువాత ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను ధారావాహిక రూపంలో ప్రసారం చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన నెట్‌వర్క్‌లు సీరియల్స్‌ని ప్రసారం చేస్తున్నాయి. అవి ఏంటంటే కలర్స్ టీవీ, స్టార్ ప్లస్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్, సన్ టీవీ, జీ టీవీ. కొన్ని టీవీ సీరియల్స్ భారత దేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆదరణను పొందుతున్నాయి. కాలానుగుణంగా మారుతున్న టీవీ చానెళ్లు సీరియల్స్‌తో పాటు కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలను కూడా ప్రసారం చేస్తుంది.