- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చపాతీలు లెక్కపెట్టి చేస్తున్నారా.. ఆవుకు, కుక్కకు పెట్టకుండా తింటున్నారా..? అయితే ఈ ప్రభావాల నుంచి తప్పించుకోలేరు..!
దిశ, వెబ్ డెస్క్ : మన భారతీయ వంటకాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ముఖ్యంగా చపాతీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలా మంది టిఫిన్స్ లో కానీ, రాత్రి భోజనంలో అన్నానికి బదులుగా చపాతీలను ఎక్కువగా తింటారు. లావుగా ఉన్నవారు త్వరగా సన్నబడటానికి చపాతీలను తింటారు. అయితే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన ఈ వంటకానికి సంబంధించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాల గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోక తప్పరు. మరి ఆ రహస్యాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది గృహిణులు ఉదయం లేవగానే టిఫిన్ కోసం చపాతీలు ప్రిపేర్ చేయడంలో నిమగ్నం అవుతారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారో లెక్క చూసి మరీ చపాతీలు చేస్తుంటారు. ఇలా చేయడం ఎన్నో అనర్ధాలకు దారితీస్తుందంట. అలా చపాతీలు లెక్కపెట్టి చేస్తే జ్యోతిష్యం ప్రకారం కుటుంబానికి మంచిది కాదట. ఇలా చేయడం ద్వారా కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుందని, అలాగే చెడు ప్రభావం ఆ కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి పై పడుతుందట. ఎక్కువగా చపాతీలను లెక్కిస్తే అది సాక్షాత్తు సూర్యభగవానున్ని అవమానించినట్లట. దాంతో సూర్యుడు ఆగ్రహించి తమ జాతకంలో బలహీన పడి కుటుంబంలో సుఖశాంతులు లేకుండా చేస్తాడని శాస్త్రం చెబుతుంది.
అంతేకాదు ఫ్రిజ్ లో పిండిని స్టోర్ చేసినప్పుడు దాని పై హానికరమైన బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యి ఆరోగ్యం చెడిపోతుంది. అలాగే చపాతీలు చేసినప్పుడు మిగిలిన పిండిని స్టోర్ చేసి మరుసటి రోజు చపాతీలు చేస్తే రాహువు పై ప్రతికూల ప్రభావం పడుతుందట. అప్పుడు రాహువు ఆగ్రహించి జాతకంలో చెడు ప్రభావాన్ని పెంచి కుటుంబం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాడట.
ఇక చాలా మంది చపాతీలు చేయగానే ముందుగా చేసిన చపాతీని ఆవులకి తినిసిస్తూ ఉంటారు. పితృ దోషం వల్ల జీవితంలో ఆర్థిక, కుటుంబ, మానసిక సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముందుగా ఆవుకి చపాతీ తినిపించాలి. అలాగే శత్రుత్వ భయాన్ని పోగొట్టుకోవడానికి చివరగా చేసిన చపాతిని కుక్కకు పెట్టాలి. అలా చేస్తే మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది.
ఇక చాలా మంది చపాతీలను సర్వ్ చేసినప్పుడు రెండూ, లేక మూడు చపాతీలను పెడుతుంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఒక ప్లేట్‌లో మూడు లేదా అంతకన్నా ఎక్కువ చపాతీలు వడ్డించకూడదట. ఎందుకంటే ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు కర్మ కాండలు చేస్తున్న సమయంలో మూడు చపాతీలు పెడతారంట. మరి చూశారు కదా ఇవి చపాతీలు చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు.