అరటి పువ్వు తింటే ఎన్ని లాభాలో మీకు తెలుసా ?

by Anjali |
అరటి పువ్వు తింటే ఎన్ని లాభాలో మీకు తెలుసా ?
X

దిశ, ఫీచర్స్: మారుతున్న జీవనశైలి మనుషులపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతోంది. చిరు తిళ్లను రుచి మరిగి పోషకాహారాన్ని పక్కన పెడుతున్నారు జనం. దీంతో అతి చిన్న వయస్సులో మధుమేహం, క్యాన్సర్, గుండె నొప్పి వంటి భయానక వ్యాధులు వెంటాడుతున్నాయి. అయితే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెప్తున్న నిపుణులు.. అరటి పువ్వు ఇందులో ఒకటని సూచిస్తున్నారు. అరటి పండు తరహాలోనే అరటి పువ్వులో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని.. దీనివల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు.

* అరటి పువ్వులో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడగలవు. రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయగలదు. షుగర్ శాతాన్ని తగ్గించి డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది.

* ఆడవాళ్ళకి నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవుతుంటే.. ఈ అరటి పువ్వుని ఉడికించి తీసుకోవడం మంచిది. అప్పుడు రక్తస్రావం తగ్గుతుంది. నెలసరి నొప్పి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

* అరటి పువ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది. ఎముకలను బలంగా, దృఢంగా మారుస్తుంది.

* ప్రెగ్నెన్సీ తర్వాత తల్లుల్లో పాల కొరత ఏర్పడినప్పుడు.. అరటి పువ్వు తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.

* అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.

* మూత్రపిండాల వ్యాధులు, కిడ్నీల్లో రాళ్ల సమస్య, గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యలకు అరటి పువ్వు బాగా పనిచేస్తుంది.

* వీర్య కణాల (స్పెర్మ్ ) సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపువ్వుని ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల వీర్యవృద్ధి జరిగి సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని సూచిస్తున్నారు.

* స్త్రీల‌లో గ‌ర్భాశ‌య సంబంధ సమస్యలను దూరం చేసే శక్తి అరటి పువ్వుకు ఉంది.

* ఈ అరటి పువ్వు కూరతో హైబీపీ అదుపులో ఉండటంతో పాటు, గుండె సంబంధ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed