- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T-షర్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్ : చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలి వారి వరకు చాలా మంది టీ షర్టులను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. షర్ట్ కన్నా టీ షర్ట్ అన్ని సీజన్లలో కంఫర్ట్‌గా ఉండడంతో దాన్నే ఎక్కువగా ధరిస్తారు. మహిళలు, పురుషులు ఎక్కువగా ధరించే టీ షర్ట్‌లు వివిధ లోగోలు, రంగులలో అందుబాటులో ఉన్నాయి. అయితే అందరూ ఎంతో ఇష్టంగా ధరించే టీ షర్ట్‌లో టీ అనే అక్షరానికి అసలు అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు. మరి ఆ అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ది సన్‌లోని ఒక నివేదిక ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికన్ సైనికుల శిక్షణా కాలంలో ఎంతో తేలికగా ఉన్న బట్టలను ధరించేవారట. ఆ దుస్తులను ట్రైనింగ్ షర్ట్స్ అని పిలిచేవారట. కొంత కాలానికి వాటినే షార్ట్‌గా T- షర్టు అని పిలిచే వారట. టీ అంటే ట్రైనింగ్ అని అర్థం. శిక్షణ చొక్కాలు అచ్చం ఇప్పుడున్న టీ షర్టులలాగానే ఉండడంతో వాటికి టీ షర్టులు అని పేరు పడింది.
ఇక మరి కొంత మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ షర్ట్ టీ ఆకారంలో ఉంటుంది. ఈ టీ షర్టులను ముందు నుంచి చూసినా, వెనక నుంచి చూసినా టీ ఆకారంలోనే కనిపిస్తాయి. బహుశా అందుకే వీటిని టీ-షర్ట్ అని పిలుస్తారని మరో వాదన ప్రచారంలో ఉన్నది.
Also Read..