- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సబ్బుకు అసలు సబ్బు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?
దిశ, ఫీచర్స్ : సబ్బు దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు ప్రతీ వస్తువును శుభ్రం చేయడానికి సబ్బును వాడుతుంటాం. ఇక ఒక్క రోజు సబ్బులేకుండా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు.స్నానానికి, బట్టలు, వంటింటి సామాను ఇలా ఏవి శుభ్రంకావాలన్నా.. సబ్బు కావాల్సిందే. అయితే అసలు ఈ సబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడూ సబ్బు సబ్బు అనే పిలిచే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందోనని ఎప్పుడైనా ఆలోచించారా?దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
సుమారు 4 వేల సంవత్సరాల క్రితం, రోమన్ మహిళలు టైబర్ నది ఒడ్డున కూర్చుని బట్టలు ఉతుకుతున్నప్పుడు, కొన్ని జంతువుల కొవ్వు నది ఎగువ నుండి ప్రవహించి, ఒడ్డున ఉన్న మట్టిలో గడ్డకట్టిందని చెబుతారు. ఇది బట్టలకు పెట్టి రుద్దితే.. వాటి మురికి పోవడాన్ని గుర్తించారు. ఈ కొవ్వు సపో పర్వతం నుండి ప్రవహించినందున, ఈ మట్టికి సబ్బు అని పేరు పెట్టారు. సబ్బు పేరు ఇక్కడ నుండి వచ్చింది.
అంతే కాకుండా ఈజిప్షియన్లు క్రమం తప్పకుండా స్నానం చేసేవారంట. వారు తమ శరీరానికి జంతు, కూరగాయల నూనెలను ఆల్కలీన్ లవణాలతో కలపడం ద్వారా సబ్బు లాంటి పదార్థాన్ని తయారు చేసేవారంట. ఆ సమయంలో వారు చర్మ వ్యాధుల చికిత్సతో పాటు, శరీరాన్ని శుభ్రపరచడానికి కూడా వాడేవారంట,బట్టల నుండి నూనె మరకలు, మురికిని తొలగించే సబ్బును మొదట టీ, బూడిద కలపడం ద్వారా సబ్బు తయారు చేయబడినది అంటున్నారు శాస్త్రవేత్తలు.