- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ice bath: ఐస్ బాత్ చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
దిశ, ఫీచర్స్: చాలామంది చల్లని నీటితో స్నానం చేయాలంటే వణిపోతుంటారు. కొందరు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు చల్లటి నీటితో స్నానం చేస్తారు. చాలామంది సెలెబ్రిటీలు కూడా ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ చల్లటి నీటితో స్నానం చేస్తుంటారు. లేదా ఎక్కడికైనా వెల్లినప్పుడు ఈ ఐస్ బాత్‌ను ట్రై చేస్తారు. ఈ ఐస్ బాత్‌ని క్రయోథెరపీ అని అంటారు. కొందరు చల్లటి నీటిలో స్నానం చేయడానికి అస్సలు ఇష్టపడరు. కానీ, చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
ఈ ఐస్ బాత్‌ను 5 నుంచి 15 నిమిషాల పాటు 10 డిగ్రీల సెల్సియస్ చల్లటి నీటిలో శరీరాన్ని ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించి, శరీరానికి మంచి అనుభూతిని ఇస్తుంది.
* శరీరమంతా చల్లటి నీటిలో ఉంచడం వల్ల రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇది ఒత్తిడి హోర్మోన్లపై సాకూల ప్రభావం చూపుతుంది. మానసిక స్థితి శక్తిస్థాయిలను పెంచుతుంది.
* ఐస్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల బాగా నిద్ర పడుతుంది. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బాగా వ్యాయమం చేసిన తరువాత చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కండరాల నొప్పి, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి.
* చన్నీటి స్నానం జీవక్రియను ప్రేరేపిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. తరచుగా ఐస్ బాత్ చేయడం వల్ల జీవక్రియ రేటు పెరిగి, శరీరంలో కొవ్వు కరిగిపోతుంది.
* అంతేకాకుండా శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లని నీటిలో ఉంచడం వల్ల రక్త నాళాల్లో వాపు తగ్గుతుంది.
* శరీరం, కండరాలలో గాయాలు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఐస్ బాత్ చేయడం వల్ల రక్తనాళాలు సంకోంచిస్తుంది. కండరాల నుండి లాక్టిక్ యాసిడ్, ఇతర జీవక్రియ వ్యర్థాలను బయటికి పంపడంలో సహాయపడతాయి. కండరాల పునరుద్ధరణను పెంచుతుంది.
ఐస్ బాత్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అవి కొందరికి సమస్యలను కలిగించవచ్చు. నరాల సమస్య, గుండె, సున్నితమైన చర్మం, ఇతర చర్మ సమస్యలు ఉన్న వారు ఐస్ బాత్‌కు దూరంగా ఉంటేనే మంచిది. ఈ ఐస్ బాత్ చేసేటప్పుడు సరైన విధానంను పాటించకపోతే చర్మం తిమ్మిరితో పాటుగా మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.