- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానసిక ఒత్తిడిని దూరం చేసే ఆహారాలేవో తెలుసా !
దిశ, ఫీచర్స్: కారణాలేమైనా వయసుతో సంబంధం లేకుండా అందరూ కామన్‌గా ఎదుర్కొనే హెల్త్ ప్రాబ్లమ్స్‌లో మానసిక ఒత్తిడి ఒకటి. వర్క్ బర్డెన్, బిజినెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్.. తదితర కారణాలతో మన దేశంలో దాదాపు 89 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఫ్యామిలీ కౌన్సిలర్లు చెప్తున్నారు. అంతేకాదు ప్రతి 8 మందిలో ఒకరు తీవ్రమైన ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
డిప్రెషన్, డయాబెటిస్, అధిక బరువు, అల్జీమర్స్ వంటివి కూడా ఒత్తిడి కారణంగా తలెత్తే సమస్యలని చెప్పవచ్చు. అయితే కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల వీటిని ఎదుర్కోవచ్చని నిపుణులు చెప్తున్నారు. మానసిక ఒత్తిడికి కారణం అయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి, హుషారుగా ఉండేందుకు తోడ్పడే సెరోటోనిన్, ఎండార్ఫిన్ వంటి హర్మోన్‌లను పెంచడంలో పలు రకాల ఆహార పదార్థాలు, పండ్లు, ఆకుకూరలు దోహదం చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
సిట్రస్ పండ్లు
ఆరెంజ్, నిమ్మ, దానిమ్మ తదితర సిట్రస్ పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. కార్టిస్టాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఎండార్ఫిన్, సెరోటోనిన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి డైట్‌లో భాగంగా సిట్రస్ ఫ్రూట్స్‌ను చేర్చితే ఆందోళన, ఒత్తిడి దూరం అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఆకుకూరలు
తోటకూర, బచ్చలి కూర, గోంగూర, పాలకూర వంటి వివిధ రకాల ఆకుకూరలు ఒత్తిడిని దూరం చేస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఉండే మెగ్నీషియం ఇందుకు అద్భుతంగా పనిచేస్తుంది. హైబీపీ సమస్యను కూడా ఆకు కూరలు నివారిస్తాయి.
అరటిపండు
అరటిపండు మెదడును చురుకుగా ఉంచే సెరోటోనిన్ హార్మోన్ రిలీజ్ అయ్యేందుకు దోహదపడుతుంది. ఇది మానసిక ఆందోళనను దూరం చేస్తుంది. బ్లూ బెర్రీస్‌లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆందోళనలను, ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.
డెయిరీ ప్రొడక్ట్స్
పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వాటి ఉత్పత్తులు మానసిక ఒత్తిడిని నివారిస్తాయి. పాలలోని లాక్టియమ్ ప్రొటీన్ ఇందుకు దోహదపడుతుంది. బీపీని కూడా నియంత్రిస్తుంది. ప్రతిరోజూ నిద్రకు అరగంట ముందు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది.
Read More: హనీమూన్ వెళ్లాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా 5 లక్షల విమాన టిక్కెట్లు
- Tags
- Health