తరుచుగా ఒకవైపే తలనొప్పి వస్తుందా? అయితే అసలు సమస్య ఇదే

by Sujitha Rachapalli |
తరుచుగా ఒకవైపే తలనొప్పి వస్తుందా? అయితే అసలు సమస్య ఇదే
X

దిశ, ఫీచర్స్: వన్ సైడ్ హెడేక్ రావడం కామన్. తలకు ఎడమ వైపు లేదా కుడి వైపు తీవ్రమైన నొప్పి తలెత్తడం సాధారణం. మైగ్రేన్ నుంచి టెన్షన్ వరకు.. ఇందుకు అనేక కారణాలు ఉండగా.. కౌంటర్ మెడిసిన్, హోమ్ చిట్కాల ద్వారా ఉపశమనం లభిస్తుంది. కానీ పదే పదే ఇలా జరిగితే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్న నిపుణులు.. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతుందో వివరిస్తున్నారు.

1. లైఫ్ స్టైల్

మనం డెయిలీ చేసే పనులు కూడా వన్‌ సైడ్ హెడేక్‌కు కారణమవుతాయి. ఒత్తిడి, తగినంత నీరు తీసుకోకపోవడం,సరైన నిద్ర లేకపోవడం, కూర్చునే విధానం, తీసుకునే ఆహారం, మితిమీరిన మందులు తీసుకోవడం ఇందుకు కారణం కావచ్చు. ఈ అలవాట్ల వల్ల నరాలు లేదా రక్త ప్రవాహంలో తలెత్తే ఇబ్బందులు తలనొప్పికి దారితీస్తాయి. డీహైడ్రేషన్ మెదడుకు బ్లడ్ సర్క్యులేషన్‌పై ఎఫెక్ట్ చూపి నొప్పిని ప్రేరేపిస్తే.. సరిగ్గా కూర్చోకపోవడంతో కండరాల ఒత్తిడి పెరిగి పెయిన్ ఫీల్ అవుతాం.

2. ఇన్‌ఫెక్షన్స్ అండ్ అలెర్జీ

అంటువ్యాధులు, అలెర్జీలు కూడా ఒకవైపు తలనొప్పికి కారణమవుతాయి. సైనస్ ఇన్ఫెక్షన్.. కళ్లు, నుదిటి చుట్టూ నొప్, ఒత్తిడిని కలిగిస్తాయి. తరచుగా ఒక వైపు మరింత తీవ్రంగా ఎఫెక్ట్ చూపుతాయి. అదేవిధంగా అలెర్ రియాక్షన్స్.. సైనస్ ఇన్‌ఫ్లమేషన్, ఆ తర్వాత తలనొప్పికి దారితీయవచ్చు. ఒక వైపుకు మాత్రమే ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో చెవి ఇన్ఫెక్షన్లు, దంత సమస్యలు కూడా వన్ సైడ్ హెడేక్ అనుభూతిని కలిగిస్తాయి. అయితే ఏ వైపు ప్రభావితం అవుతుందనేది ఇన్‌ఫెక్షన్ అయిన ప్లేస్, నరాల సున్నితత్వం వంటి వ్యక్తిగత అంశాలపై ఆధారపడి ఉంటుంది.

3. వైద్య పరిస్థితులు

కొన్ని తీవ్రమైన వైద్య పరిస్థితులు కూడా ఒకవైపు తలనొప్పికి కారణమవుతాయి. వెన్నుపూస లేదా కరోటిడ్ ధమని విచ్ఛేదం తరచుగా వన్ పైడ్ హెడేక్‌గా వ్యక్తమవుతుందని ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ఒక వైపున తలనొప్పిని కలిగించే మరొక రకమైన వైద్య పరిస్థితి బ్రెయిన్ అనూర్సిమ్. జర్నల్ ఆఫ్ న్యూరోఇమ్యునాలజీలో ప్రచురించబడిన స్టడీ ప్రకారం.. మెదడు వాపు లేదా మెదడు కణజాలం వాపు, బ్రెయిన్ ట్యూమర్లు కూడా తలనొప్పికి కారణమవుతాయి.

4. మందులు

కొన్ని మెడిసిన్స్ మితిమీరిన వినియోగం ఒక వైపు తలనొప్పికి దారితీయవచ్చు. ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ లేదా ఎసిటమైనోఫెన్ వంటి నొప్పి నివారిణులను అధికంగా ఉపయోగించడం ఒక సాధారణ ఉదాహరణ. కాగా ఈ మందులను అతిగా ఉపయోగించినప్పుడు.. మితిమీరిన తలనొప్పి లేదా రీబౌండ్ హెడేక్‌కు దారితీయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed