- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేట్‌నైట్ ఆహారపు అలవాట్లు అనర్థానికి దారితీస్తాయా..?
దిశ, ఫీచర్స్: కొందరికి లేట్ నైట్‌లో చిరుతిళ్లు, ఆహారం తినే అలవాటు ఉంటుంది. నిద్రపట్టనివారు కూడా ఫ్రిజ్‌లో అందుబాటులో ఉండే స్వీట్లు, వివిధ రకాల ఆహార పదార్థాలు లాగించేస్తుంటారు. అయితే ఇలా చేయడం అస్సలు మంచిది కాదంట. నిద్రపోయే ముందు, లేదా రాత్రిపూట ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్‌తోపాటు కొలెస్ర్టాల్ పర్సెంటేజ్ పెరిగి గుండె జబ్బులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేగాక లేట్‌నైట్ ఫుడ్ మెదుడుపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
నగరాల్లో నివసించే వారు చాలా మంది రాత్రి 10 దాటిన తర్వాత భోజనం చేస్తారు. కొందరు 11 గంటలు, ఆ తర్వాత కూడా డిన్నర్ చేస్తుంటారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్ తీసుకుంటుంటారు. సెల్‌ఫోన్, టీవీ చూస్తూ తమకు తెలీకుండానే అధికంగా తినేస్తుంటారు. చిరుతిళ్లు లాగించేస్తుంటారు. ఇలా టైంపాస్ కోసమో, అలవాటుగానో రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్ మెదడుపై వ్యతిరేక ప్రభావం చూపుతాయని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. కొన్నేండ్లపాటు లేట్‌నైట్, లేదా నిద్రపోయేముందు జంక్‌ఫుడ్, స్నాక్స్ తినేవారిలో మెదడుపై ఒత్తిడి పెరుగుతుందని, బ్లడ్ సర్క్యులేషన్ సమస్య ఏర్పడుతుందని, జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.