Junk Food తింటే పురుషుల్లో 'ఆ' సామర్థ్యం తగ్గిపోతుందని తెలుసా !

by Prasanna |   ( Updated:2023-01-30 11:06:59.0  )
Junk Food తింటే పురుషుల్లో ఆ సామర్థ్యం తగ్గిపోతుందని తెలుసా !
X

దిశ, ఫీచర్స్ : జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదన్నది అందరికీ తెలిసిందే. మరో కొత్త విషయం ఏంటంటే అది పురుషుల లైంగిక సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఆహార నిపుణులు చెప్తున్నారు. పురుషులు తరచూ జంక్ పుడ్ తినడంవల్ల వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని అమెరికన్, డానిష్ దేశాలకు చెందిన పరిశోధనల బృందం హార్వర్డ్ యూనివర్సిటీ వేదికగా జరిపిన ఒక పరిశోధనలో తేలింది. ఎక్కువ మొత్తంలో పిజ్జాలు, బర్గర్లు, హై ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడంవల్ల యువకులు ఫిట్‌గా ఉన్నట్టు కనిపించవచ్చునేమో కానీ లైంగిక జీవితంపై మాత్రం చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశోధన ప్రకారం కొన్నిరకాల జంక్ ఫుడ్స్ వృషణాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితి క్రమంగా దీర్ఘకాలిక సమస్యకు దారి తీయవచ్చు. హార్వర్డ్ వర్సిటీ కేంద్రంగా జరిపిన పరిశోధనలో నిపుణుల బృందం తరచూ జంక్ ఫుడ్స్ తీసుకుంటున్న 19 ఏండ్ల వయస్సు గల దాదాపు 3 వేల యువకులను అజ్జర్వ్ చేసింది. డైట్ సర్వే ఆధారంగా పురుషులపై ఈ పరిశోధన జరిగింది. ప్రాసెస్ చేసిన చేపలు, మాంసం, అలాగే పిజ్జా, బర్గర్‌ లాంటి ఆహారాలు తిన్న యువకులలో స్పెర్మ్ కౌంట్ క్షీణిస్తున్నట్టు గుర్తించారు. తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్న పురుషుల ఆహారంలో ఇన్హిబిన్-బి అనే రసాయనం కూడా తక్కువగా ఉంటున్నట్టు తేలింది. అంతేకాదు ఇది స్పెర్మ్ ప్రొడక్ట్ చేసే సెర్టోలీ కణాలను దెబ్బతీస్తుందని వెల్లడైంది. కాబట్టి తరచూ జంక్ ఫుడ్స్‌పై ఆధారపడేవారు ఆ అలవాటును మార్చోకోవడంవల్ల మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

READ MORE

చెంపదెబ్బ కాంపిటీషన్.. ఇంటర్నేషనల్ లెవల్.. లక్షల్లో బహుమతి.. కానీ..?

Advertisement

Next Story