- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
End of the World : ప్రపంచం అంతం ఆ సంవత్సరంలోనే.. బాబా వంగా, బ్రహ్మం గారు, న్యూటన్ ముందే అంచనా వేశారా ..?

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ప్రపంచం అంతం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇది అన్ని దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం లేకపోలేదు.. రీసెంట్ గా మెక్సికోలో ఓర్స్ ఫిష్ బయటికి రావడం, వేల చేపలు కొట్టుకురావడం, గుట్టలు గుట్టలుగా తాబేళ్లు ఒడ్డుకు రావడం వంటి షాకింగ్ సంఘటనలు జరిగాయి. అయితే, ఈ సంకేతాలు ప్రపంచం అంతం గురించి చెబుతున్నాయా అంటూ కొందరు వీటి గురించి రీసెర్చ్ చేస్తున్నారు. బ్రహ్మం గారు , బాబా వంగ, న్యూటన్.. ఈ ముగ్గురు భవిష్యత్తు గురించి చెప్పిన అంచనాలు చాలావరకు నిజమయ్యాయి. భూమి అంతం కాబోతోందని, ప్రళయం రావడం పక్కా అని ముందే చెప్పారు.
బ్రహ్మంగారి కాలజ్ఞానం ( Brahmam Gari Kalagnanam )
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బ్రహ్మం గారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా ఎంతో మంది ఈయన పేరు తలుస్తూ ఉంటారు. ఎందుకంటే, బ్రహ్మం గారు రాసిన కాల జ్ఞానంలో చాలా వరకు జరిగాయి. కరోనా గురించి కూడా ఈయన ముందే చెప్పారు. ప్రపంచంలో పాపాలు ఎక్కువైతే భూమి అంతమయ్యే రోజు వెతుక్కుంటూ వస్తుందని తెలిపారు.
బాబా వంగా ( Baba Vanga )
వరల్డ్ వైడ్ గా ఎంతోమంది భవిష్యత్తు గురించి అంచనాలు వేశారు. వారిలో బాబా వంగా కూడా ఒకరు. అయితే , బాబా వంగ ని మగ వ్యక్తి అని పొరబడుతుంటారు, వాస్తవానికి ఆమె ఒక మహిళ. ఆమె పూర్తి పేరు వంగేలియా పండీవ గుస్తేరోవా(Vangeliya Pandeva Gushterova) అయితే బాబా వంగ అని పిలిచే వారు. 12 ఏళ్ల వయస్సులో తన చూపును కోల్పోయిన బాబా వంగ.. తన జ్ఞానదృష్టితో భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ముందే చెప్పింది. ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ముందే ఊహించారు. అయితే ఆమె వేసిన అంచనా వేసిన వాటిలో ప్రపంచం 2060 లో అంతమవుతోందని చెపింది. ఇది కొన్ని దేశాల ప్రజలను కలవరపెడుతోంది.
న్యూటన్ ( Newton )
న్యూటన్ తన చివరి లేఖలో కూడా ప్రపంచ అంతం గురించి ముందే తెలిపాడు. 2060 ఏడాది వరకు మనుగడ సాగితే.. అదే సంవత్సరంలో భూమి అంతం కానుందని తెలిపాడు. ప్రపంచం అంతం కోసం ఒక ఫార్ములాని కూడా స్పష్టంగా రాశాడు. 1704 ఏడాదిలో న్యూటన్ దీని గురించి అంచనా వేశాడు. దీంతో పాటు న్యూటన్ ఒక సూచన కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన లెటర్ కూడా ఆయన ఇంట్లో దొరికిందని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.
Read More..