హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌కు కారణమవుతున్న సువాసనలు

by sudharani |   ( Updated:2022-08-10 04:36:28.0  )
హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌కు కారణమవుతున్న సువాసనలు
X

పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్(PCOS) అనేది మహిళల్లో సర్వసాధారణమైన హార్మోన్ సమస్యల్లో ఒకటి. ప్రస్తుతమున్న బిజీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్.. పది మంది స్త్రీలలో కనీసం ముగ్గురికి ఈ పరిస్థితి తలెత్తేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే క్రమంతప్పని వ్యాయామం, పోషకారం, హెల్తీ వెయిట్ మెయింటెనెన్స్ సిఫారసు చేస్తున్న నిపుణులు. PCOSతో బాధపడేవారు పాలు, పాల ఉత్పత్తులు, ప్లాస్టిక్స్, కాస్మోటిక్స్, పెర్‌ఫ్యూమ్స్‌ వినియోగానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వస్తువులను తప్పనిసరిగా లైఫ్ నుంచి తొలగించాలని సూచిస్తున్నారు.

పెర్‌ఫ్యూమ్-పీసీఓఎస్‌కు మధ్య సంబంధం?

పెర్‌ఫ్యూమ్స్ మహిళలకు హానికరం అంటే నమ్మలేకపోతున్నారా? కానీ ఇది వంద శాతం నిజమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో చాలా వరకు ట్రైక్లోసన్(TCS)గా పిలువబడే క్లోరినేటెడ్ ఫ్రాగ్రెన్స్ కాంపౌండ్ ఉంటుంది. ఇది వ్యక్తిగత సంరక్షణతో పాటు పెర్‌ఫ్యూమ్డ్ సోప్స్, షాంపూ, టూత్‌పేస్ట్, ద్రవ క్రిమిసంహారకాల వంటి గృహోపకరణాల తయారీలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అయితే చాలా దేశాల్లో ట్రైక్లోసన్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ కావడం వల్ల కలిగే నష్టాలు గమనించబడ్డాయి. దీంతో ఈ అంశంపై పరిశోధించిన పలు యానిమల్ అండ్ ఇన్‌ విట్రో స్టడీస్.. హార్మోనల్ యాక్టివిటీస్‌ను TCS ఎలా ప్రభావితం చేస్తుందో గుర్తించాయి. PCOS సిండ్రోమ్‌తో సంబంధం కలిగిన ఈస్ట్రోజెనిక్, ఆండ్రోజెనిక్, యాంటీఆండ్రోజెనిక్ కార్యకలాపాలు.. థైరాయిడ్ హార్మోన్‌ యాక్టవిటీస్‌కు భంగం కలిగిస్తాయని పేర్కొన్నాయి. కాగా ఈ రీసెర్చ్ పీసీఓఎస్ క్లినికల్ మ్యానిఫెస్టేషన్‌కు దోహదపడుతుందని వివరించారు పరిశోధకులు.

ట్రైక్లోసన్ బ్యాన్..?

ఈ నేపథ్యంలోనే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA).. సెప్టెంబరు 9, 2016న బాతింగ్ సోప్ ఉత్పత్తులకు ట్రైక్లోసన్‌తో పాటు 18 ఇతర యాంటీమైక్రోబయల్ రసాయనాలను చేర్చడాన్ని నిషేధించింది. మరుసటి ఏడాదే.. ప్రీమార్కెట్ సమీక్ష లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా వినియోగించే యాంటీసెప్టిక్ ఉత్పత్తుల్లో ట్రైక్లోసన్‌ను ఉపయోగించరాదని కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటికీ భారతదేశంలో ట్రైక్లోసన్-లేస్డ్ ఉత్పత్తుల వాడకంపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారుతుందేమోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సింథటిక్ ఫ్రాగ్రెన్స్‌ పెర్‌ఫ్యూమ్స్‌లో PCOS?

శరీర అభివృద్ధి, పెరుగుదల, యుక్త వయసు, పునరుత్పత్తి ప్రక్రియలను నిర్వహించే ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్(FSH), లైంగిక అభివృద్ధి, మహిళల్లో ఋతుచక్రం నియంత్రణ, అండాశయం నుంచి అండాల విడుదలను కూడా ప్రేరేపించే లూటినైజింగ్ హార్మోన్(LH) మధ్య సరైన సమతుల్యత ఉంది. అయితే 'ఎన్విరాన్మెంటల్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్'గా పిలువబడే సింథటిక్ సువాసనల్లోని కొన్ని సమ్మేళనాలు.. ఈ FSH, LH మధ్య సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఫలితంగా PCOS వంటి పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణ మహిళలతో పోలిస్తే ఇలాంటి సువాసనలను ఉపయోగించే రోగుల్లో PCOS సంభావ్యత ఎక్కువగా ఉందని పరిశోధనలు గుర్తించాయి.

అందుకే ఇలాంటి పెర్‌ఫ్యూమ్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలని సలహాలిస్తున్న నిపుణులు.. సింథటిక్ ఫ్రాగ్రెన్స్ కలిగిన ఏ పెర్‌ఫ్యూమ్ కూడా సురక్షితమైందని చెప్పలేమని వివరించారు. చిన్న మొత్తాలు కూడా PCOSతో అనుబంధించబడ్డాయని, అందుకే ఈ ఎన్విరాన్మెంటల్ ఎండోక్రైన్ డిస్‌రప్టర్స్ లేని ఎస్సెన్షియల్ ఆయిల్ లాంటి సహజ ఉత్పత్తులను వాడాలని సూచించారు.

ఉపవిష్ట కోణాసనం.. ప్రయోజనాలు

Advertisement

Next Story