- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Constipation: మలబద్ధకంతో బాధపడేవారు దీనితో చెక్ పెట్టండి!

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది మలబద్ధకంతో ( constipation) బాధపడతారు. బయట ఫుడ్స్ తినడం వలన ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. చలికాలంలో తక్కువ నీరు తాగడం వలన మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. కొందరు గంటల తరబడి కూర్చొన్న కానీ, కడుపు కొంచం కూడా క్లీన్ అవ్వదు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధ పడుతుంటే ఈ పండును మీ డైట్ లో చేర్చుకోండి.
రోజుకొకసారి ఈ పండును తీసుకుంటే చాలు.. ఎందుకంటే, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందాలంటే ఎలాంటి పండు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..
శీతాకాలంలో వచ్చే జామకాయ ( Guava) మలబద్ధకం, పైల్స్ సమస్యకు చెక్ పెడుతుంది. ఉదయాన్నే జామపండును తీసుకుంటే .. పొట్ట క్లియర్ అవుతుంది. అంతే కాకుండా, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ 1 జామపండును తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. పీచుతో కూడిన జామ ప్రభావంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.