- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కండోమ్స్ ప్యాకెట్.. కలర్ టీవీ కన్నా కాస్ట్‌లీ!
దిశ, ఫీచర్స్ : అవాంఛిత గర్భాలను నివారించేందుకు అనేక మార్గాలున్నాయి. కండోమ్ లేదా ఎలాంటి గర్భనిరోధక సాధనంతోనైనా ఈ రోజుల్లో గర్భాలను నివారించడం కష్టమైన పని కాదు. కానీ కండోమ్స్ వాడే విషయంలో ప్రపంచంలో అందరికీ ఒకే రకమైన స్వేచ్ఛ లేనట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా వెనిజులా దేశంలో అబార్షన్ చట్టవిరుద్ధం కాబట్టి అక్కడ గర్భనిరోధకాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్క కండోమ్ ప్యాక్ కోసం వెనిజులా ప్రజలు రూ.60,000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అయితే ధరలు ఇంతలా భయపెడుతున్నప్పటికీ ప్రజలు కండోమ్స్ కొనుగోలు కోసం షాపుల బయట గుమిగూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
వెనిజులాలో కఠిన అబార్షన్ చట్టాలు అమలులో ఉన్నందున గర్భనిరోధకాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. దీంతో ఫార్మసీలు, సూపర్ మార్కెట్స్‌లో గర్భనిరోధకాలు, కండోమ్స్ కనుగొనడం ప్రజలకు చాలా కష్టంగా ఉంది. ఇక బ్లాక్ మార్కెట్‌లో కాంట్రాసెప్టివ్స్‌కు వాస్తవ ధరల కంటే రెట్టింపు లేదా మూడు రెట్ల ధర పలుకుతోంది. ఇది కలర్ టీవీ కన్నా కాస్ట్‌లీ కాగా.. ఈ లెక్కన ఒక సామాన్యుడు కండోమ్ ప్యాక్ కొనాలంటే కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
UN స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2015 ప్రకారం, లాటిన్ అమెరికాలో యుక్తవయస్సులో గర్భం దాల్చే కేసుల్లో అత్యధిక రేటు కలిగిన దేశం వెనిజులా. ఇక ఇతర దక్షిణ, మధ్య అమెరికా దేశాల్లో గుర్తించదగిన మార్పులు ఉన్నప్పటికీ ఈ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఒకవేళ కండోమ్స్ ధరలు ఇలాగే కొనసాగితే HIV కేసులతో పాటు లైంగిక సంక్రమణ వ్యాధులు పెరిగిపోయే అవకాశం ఉంది.