కోడిగుడ్లతో చిప్స్! ఒక్కసారి తింటే వదలరు.!

by Anjali |   ( Updated:2023-04-25 10:50:39.0  )
కోడిగుడ్లతో చిప్స్! ఒక్కసారి తింటే వదలరు.!
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు స్కూలు నుంచి రాగానే ఏదో ఒకటి చిరుతిండ్లు కావాలని కోరుకుంటారు. ఆలు చిప్స్, టమాటో చిప్స్ లాంటి మరెన్నో ఐటెమ్స్ తింటుంటారు. వీటితో పాటు ఎంతో రుచికరమైన కోడిగుడ్లతో ఓ సారి చిప్స్ తయారు చేసి..మీ పిల్లలకు స్నాక్స్‌లా పెట్టండి. ఇవి ఎంతో టేస్టీగానే ఉండటమే కాకుండా, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎంతగానో తోడ్పడుతుంది.

ఇవి రెడీ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఈ చిప్స్ తయారు చేయడానికీ ఏ ఐటమ్స్ కావాలో చూద్దామా..

* బంగాళదుంపలను తీసుకొని శుభ్రంగా కడుక్కుని.. వాటిని చిప్స్ షేప్‌లో కట్ చేసుకోవాలి.

* ఒక బౌల్‌లో కోడిగుడ్లను తీసుకొని అందులో సాల్ట్, కారం వేసి బీటర్‌తో బీట్ చేయాలి.

* బీటర్ లేని వాళ్లు, జార్‌లో వేసి మిక్సీ పట్టి, ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.

* అనంతరం స్టవ్‌పై కడాయిలో ఆయిల్ పోయాలి. అది వేడి అయ్యాక..ఆలు చిప్స్‌ను ఒక్కొక్కటి తీసుకొని ఎగ్ మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి.

* అవి గోల్డ్ రంగులోకి వచ్చాక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే కోడిగుడ్డు చిప్స్ రెడీ.

* ఈ చిప్స్‌ను టమాట కిచప్‌తో యాడ్ చేసుకొని తింటే మరింత రుచిగా ఉంటాయి.

Also Read..

ఫ్రెంచ్ ఫ్రైస్‌తో డిప్రెషన్.. యువకులే బాధితులు..

Advertisement

Next Story