Childrens skills : పిల్లల్లో మల్టీ టాస్కింగ్ స్కిల్స్ పెరగాలంటే..

by Javid Pasha |
Childrens skills : పిల్లల్లో మల్టీ టాస్కింగ్ స్కిల్స్ పెరగాలంటే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగానే పిల్లలు ఇంటి బయట, ప్లే గ్రౌండ్‌లో లేదా పార్కుల్లో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం చలికాలం కారణంగా స్కూళ్ల నుంచి రాగానే ఎక్కువసేపు ఆడుకోవడానికి పిల్లలు ఇష్టపడరు. పేరెంట్స్ కూడా వద్దని చెప్తుంటారు. దీంతో ఇంటిలోనే ఎక్కువ సమయం గడిపే పిల్లలు తర్వాత చదువుకుంటామంటూ టీవీలు, ఫోన్లు వంటి స్ర్కీన్లకు అతుక్కుపోతుంటారు. ఈ పరిస్థితి పిల్లల ఆరోగ్యంపై ప్రతి కూల ప్రభావం చూపుతుందని పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతుంటారు. అయితే దీనికి చక్కటి పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. స్ర్కీన్లకు అలవాటు పడకుండా పిల్లలను ఇండోర్ గేమ్స్ వంటి యాక్టివిటీస్ వైపు వారి దృష్టి మళ్లించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

ముఖ్యంగా పిల్లలకు స్టోరీస్ చెప్పడం వల్ల వారిలో లిజనింగ్ స్కిల్స్, అలాగే క్రియేటివ్ ఐడియాస్ డెవలప్ కావడానికి దోహదం చేస్తాయి. దీంతోపాటు పిల్లల వయస్సును దృష్టిలో పెట్టుకొని వారికి అర్థం అయ్యేలా కథల పుస్తకాలు చదివి వినిపించడం, వివరించడం వంటివి కూడా చేయవచ్చు. ఉత్సాహాన్ని నింపే విధంగా పలు అంశాలను జోడించి చెప్పడం ఇంకా మంచిది. ఇవన్నీ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ కావడానికి దోహద పడతాయి. అలాగే ఎంపిక చేసిన బుక్స్ కూడా పిల్లలతో చదివించవచ్చు. కొన్ని వస్తువులను ఆయా ప్లేస్‌లలో పిల్లల ద్వారా పెట్టించి, తర్వాత ఏ వస్తువు ఎక్కడ పెట్టారో అడగడం వంటివి చేస్తుంటే వారిలో జ్ఞాపశక్తి పెరుగుతుంది. బెడ్‌పై ఉండే దిండ్లు, దుప్పట్లు, వివిధ ఆట బొమ్మలను ఉపయోగించి గుహల మాదిరి నిర్మించడం, పక్షులకు అవసరమైన స్థావరాల ఆకారాలు క్రియేట్ చేయడం వంటి ఇమాజినేషన్ ఇండోర్ గేమ్స్‌ను ప్రోత్సహించడం ద్వారా పిల్లల్లో క్రియేటివిటీ, మల్టీ టాస్కింగ్ అండ్ ప్రాబ్లం సాలోయింగ్ స్కిల్స్ పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed