పిల్లలతో ఫోన్ వదిలించలేక విసిగిపోతున్నారా?.. ఇలా ట్రై చేయండి..

by srinivas |
పిల్లలతో ఫోన్ వదిలించలేక విసిగిపోతున్నారా?.. ఇలా ట్రై చేయండి..
X

దిశ, ఫీచర్స్: ఈ తరం పిల్లలంతా టీవి, ఫోన్‌, ట్యాబ్, కంప్యూటర్ స్క్రీన్‌లకు అతుక్కుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ జనరేషన్ చిల్డ్రెన్స్‌ను స్ర్కీన్‌కు దూరంగా ఉంచడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారింది. ఇంటి వాతావరణమంతా ఎలక్ట్రానిక్ పరికరాలతో నిండి ఉండటం వల్ల పిల్లలకు పరిమితులు విధించడం అనుకున్నంత సులభం కాలేకపోతుంది. కానీ పిల్లలు దీర్ఘకాలం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే చర్యలు తీసుకోకతప్పదు. కానీ అవి కఠినంగా కాకుండా స్మూత్‌గా ఉండాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం పేరేంట్స్‌ ఈ 5 చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.

ఎలక్ట్రానిక్స్‌కు దూరంగా

మొదటగా పిల్లల ముందు తల్లిదండ్రులు ఫోన్లు చూడటం తగ్గించాలి. నిరంతరం పిల్లలకు సలహాలు ఇవ్వకుండా ఏదో ఒక క్రియేటివిటీ పనిని మొదలుపెట్టి వాళ్ల దృష్టిని వాటిపైకి మరలించాలి. ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలోనూ స్క్రీన్‌పై పిల్లల దృష్టిని ఆకర్షించకుండా ఎలక్ట్రానిక్‌ బాక్స్‌లను దూరంగా లేదా కనిపించకుండా జాగ్రత్త పడాలి. వీలైతే మొబైల్‌ను సైలెంట్‌లో పెట్టాలి.

బయటికి వెళ్లండి

ఉద్యోగ రిత్యా ఆలసిపోయినప్పటికీ ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకునే బదులు పిల్లలకు సంతోషం కలిగించే ప్రదేశంలోకి తీసుకెళ్లి కాసేపు నడవండి లేదా ఆడుకోండి. ఇది మీతోపాటు వారి మానసిక స్థితితోపాటు శారీరకగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు ప్రకృతి గొప్పతనాన్ని, జీవరాశి మనుగడకు సంబంధించి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పేందుకు ట్రై చేయండి.

వాస్తవికంగా ఉండండి

మీ పిల్లలు టీవీ చూడటంతో సహా వారి ఖాళీ సమయాన్ని ఎక్కువ సమయం స్క్రీన్‌లపై గడిపినట్లయితే చిన్న చిన్న పనులు చెప్పాలి. వాటికి పరిమిత సమయం కేటాయించి లక్ష్యాన్ని చేరుకునేలా మోటివేట్ చేయాలి. ఒకేసారి ఫోన్‌కు దూరం చేయకుండా కనీసం రోజుకు ఒకటి నుంచి రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయాన్ని చూపిస్తే క్రమక్రమంగా స్క్రీన్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. పిల్లలను వద్దని మనం ఫోన్ చూడాల్సిన అవసరం ఏర్పడితే తప్పకుండా పనికి సంబంధించిన అవసరాన్ని గురించి వివరించండి. ఎల్లప్పుడూ వాళ్లతో నిజాయితిగా ఉండేందుకు ప్రయత్నించండి.

ఫేస్ టూ ఫేస్ డిస్కషన్

ప్రతి రోజు వారితో ఒక గంటసేపైన ఫేస్ టూ ఫేస్ పలు విషయాల గురించి చర్చించేందుకు సమయాన్ని వెచ్చించండి. పాఠశాల నుంచి వచ్చిన తర్వాత వారి రోజువారి హోం వర్క్ పట్ల శ్రద్ధ వహించండి. టీచర్లను అడిగేందుకు సంకోచించే డౌట్లను మీతో షేర్ చేసుకునే స్వేచ్ఛ కల్పించండి. మంచి చెడులకు సంబంధించిన విషయాల్లో ఓపెన్‌గా ఉండండి.

సరిహద్దులు పెట్టండి

చిన్నతనం నుంచి పిల్లలకు హద్దులు పెట్టడం పెద్దయ్యాక మంచి ఫలితాలు ఇవ్వొచ్చు. ముఖ్యంగా కుటుంబ భోజనం సమయంలో ఫోన్‌లను నిషేధించడంతో ఈ పనిని ప్రారంభించడం ఒక సులభమైన మార్గం. అలాగే గారాబం ఎక్కువ చేయకుండా మీరంటే గౌరవంతో కూడిన భయం ఉండేలా జాగ్రత్త పడండి. ఫ్రెండ్లీగా ఉంటూనే రిలేషన్ ప్రత్యేకతలను, రెస్పెక్ట్‌కు సంబంధించిన సూచనలు ఇవ్వండి. బాల్య దశ నుంచి లిమిట్స్ లేకపోతే యవ్వనంలో మీ మాటకు విలువ ఇవ్వకుండా హద్దులు దాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed