- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీఎస్‌సీ పరీక్షలో ఫెయిల్ అయిన చాట్‌జీపీటీ..
దిశ, ఫీచర్స్: ChatGPT ప్రతి రోజూ హెడ్ లైన్స్ టచ్ చేస్తూనే ఉంది. OpenAI డెవలప్ చేసిన బ్లాక్‌బస్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ మనుషులు అడిగే ప్రశ్నలకు సహజమైన, వివరణాత్మక సమాధానాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ అన్నీ తెలిసిన చాట్‌బాట్ UPSC పరీక్షలో మాత్రం విఫలమైంది.
భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులను నియమించేందుకు అత్యంత కఠినమైన జాతీయ స్థాయి పరీక్ష యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. ప్రతి ఏటా వేలాది మంది యువకులు ఈ పరీక్షకు హాజరవుతారు. సక్సెస్ అయితే మేధావిగా కీర్తించబడతారు. జాబ్ సంపాదించి.. ఉన్నత పదవుల్లో హ్యాపీగా సెటిల్ అయిపోతారు. ఈ క్రమంలోనే అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకారం.. చాట్‌జీపీటీ యూపీఎస్‌సీ పరీక్ష రాసింది. UPSC ప్రిలిమ్స్ 2022 నుంచి ప్రశ్న పేపర్ 1, సెట్ Aలో 100 ప్రశ్నలకు సమాధానాలు మార్క్ చేసింది. కానీ ఇన్నాళ్లు తన స్మార్ట్ అండ్ ఇంటెలిజెన్స్‌తో అటెన్షన్ గ్రాబ్ చేసిన చాట్ జీపీటీ.. ఈ పరీక్షలో కేవలం 54కి మాత్రమే సరిగ్గా సమాధానం చెప్పగలిగింది. అయితే జనరల్ కేటగిరీ విద్యార్థులు తదుపరి రౌండ్‌కు వెళ్లడానికి కటాఫ్ 87.54. కాగా ChatGPT కట్-ఆఫ్ సాధించకపోవడంతో.. UPSC పరీక్షలో విఫలమైంది.