జర్నీలో తలనొప్పి, వికారం వేధిస్తున్నాయా?.. అయితే వీటిని తీసుకెళ్లండి!

by Prasanna |   ( Updated:2023-05-06 06:35:36.0  )
జర్నీలో తలనొప్పి, వికారం వేధిస్తున్నాయా?.. అయితే వీటిని తీసుకెళ్లండి!
X

దిశ, ఫీచర్స్: జర్నీ అనేది చాలామందికి మంచి అనుభూతినిస్తుంది. ఇష్టమైన ప్రదేశానికి వెళ్తున్నామన్న సంతోషాన్నిస్తుంది. అదే సందర్భంలో కొందరు ప్రయాణంలో ఉన్నప్పుడు స్నాక్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. కొన్ని రకాల చిరుతిళ్లవల్ల బాడీలో యాసిడ్ (ఆమ్లత్వం) అధికంగా రిలీజ్ అయ్యి అజీర్తి, కడుపులో అసౌకర్యం, తలనొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుంది. అందుకే మీరు జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. స్నాక్స్ తినకుండా ఉండలేని పరిస్థితుల్లో అవితిన్నాక ఏర్పడే సమస్యలనుంచి ఉపశమనం కలిగించేందుకు కొన్ని రకాల పండ్లు, ఆహారాలు మీ క్యారీ బ్యాగ్‌లో తీసుకెళ్లడం బెటర్ అని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తున్నారు.

ఫెన్నెల్ సీడ్స్

ఫన్నెల్ సీడ్స్ లేదా సోంపును నిపుణులు కార్మినేటివ్ అని కూడా అంటారు. దీనిని తినడంవల్ల పెరిస్టాల్సిస్ జరిగి(జీర్ణనాళం ద్వారా ఆహారాన్ని తరలించే అలల వంటి కండరాల సంకోచం), జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేగాక ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. తక్కువ కేలరీలకు, విటమిన్ సికి మంచి మూలం. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉండటంవల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎంజైమ్ యాక్టివేషన్, మెటబాలిజం, సెల్యుటార్ ప్రొటెక్షన్, బోన్ డెవలప్ మెంట్‌కు మేలు చేసే సోంపును ప్రయాణంలోనేగాక అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉండటం మంచిది.



యాలకులు(Cardamom)

స్పైసెస్ నాచురల్ కూలింగ్ ఎఫెక్ట్‌గా యాలకులు(ఇలాయిచీ) పనిచేస్తాయి. రుచికరమైన వంటల్లో రుచికోసం వీటిని వాడుతారు. భోజనం తర్వాత వీటిని తినగలిగితే అద్భుతమైన మౌత్ ఫ్రెషనర్‌గా కూడా చేస్తాయి. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి. శరీరంలో ఏర్పడే అదనపు నీటిని తొలగించడానికి మూత్రవిసర్జనను ప్రోత్సహిస్తాయి. అసౌకర్యం, వికారం, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.



నిమ్మకాయ

చాలా మందికి ప్రయాణంలో వికారంగా, తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించడంలో నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. దానిని స్నిప్ చేయడం, వాసన చూస్తుండటంవల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. అంతేగాక జీర్ణక్రియకు దోహదపడుతుంది. భోజనానికి ముందు లేదా తర్వాత కూడా నిమ్మరసం తాగడం ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని సిట్రిక్ యాసిడ్ కడుపులో జీర్ణ సంబంధిత ద్రవం ఉత్పత్తి కావడానికి దోహదం చేస్తుంది.



ఆసుఫోటిడా(Asafoetida)

ఇది అనేక ఆసియా దేశాలలో కనిపించే బలమైన ఘాటైన మసాలా. ఉబ్బరం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. 5 టీ స్పూన్ల నీటిలో చిటికెడు ఆసుఫోటిడాను కలిపి భోజనం తర్వాత తాగడంవల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే బ్రోన్ కైటిస్, కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. అందుకే మీరు జర్నీ చేసేటప్పుడు దీనిని వెంట పెట్టుకెళ్లడం బెటర్.



Read More: జ్వరం నుంచి తక్షణ ఉపశమనానికి 5 చిట్కాలు!

Advertisement

Next Story

Most Viewed