Varalakshmi Vratham: భర్త లేనివారు వరలక్ష్మి వ్రతం చేయొచ్చా? జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?

by Anjali |   ( Updated:2024-08-16 05:38:33.0  )
Varalakshmi Vratham: భర్త లేనివారు వరలక్ష్మి వ్రతం చేయొచ్చా? జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, ఫీచర్స్: నేడు వరలక్ష్మి వ్రతం కాబట్టి కొంతమంది భర్తలేని స్త్రీలు అమ్మవారికి పూజ చేయొచ్చా అనే సందేహాలు తలెత్తే ఉంటాయి. కాగా దీనిపై పండిత జ్యోతిష్యులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. భర్తలేని వారు లక్ష్మిదేవికి పూజలు చేస్తే ఇంట్లో మంచి జరగదు అనేది దుష్ప్రచారం తప్పితే మారేమి లేదని పండితులు అంటున్నారు. భర్తలేని స్త్రీలు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా అమ్మవారికి కుంకుమ పూజ చేయొచ్చని, వ్రతంలో పాల్గొనవచ్చని చెబుతున్నారు. వితంతువులు కూడా దేవాలయాలకు వెళ్లి అన్ని పూజలు చేయవచ్చేని అంటున్నారు. భర్త లేడు కాబట్టి పూజలో పాల్గొనకూడదు అనే అధికారం ఎవ్వరికి లేదని, అమ్మవారికి ఆరాధించాలంటే భర్త ఉండాలన్న నియమం లేదని క్లారిటీ ఇచ్చారు. వచ్చే జన్మలో అయినా నాకు మంగళభాగ్యం దొరకాలని అమ్మవారికి దండం పెట్టుకోవచ్చని అంటున్నారు.

వివాహంలో ధర్మ, అర్ధ,కమాలకు సంబంధించిన వాగ్ధానాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. కాగా మోక్షం ఎవరికి వారు సాధించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా పెళ్లి కానీ మహిళలు, గర్భవతులు కూడా వరలక్ష్మి పూజలో పాల్గొనవచ్చని.. కానీ ప్రెగ్రెన్సీ మహిళలు 7 వ నెల వచ్చాక చేయవద్దని అంటున్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎవరికీ పండ్లు ఇవ్వరికి ఇవ్వకూడదు అంటారు. కానీ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు పక్కవారికి పండ్లు ఇవ్వడం వల్ల దాన ఫలితం దక్కుతుందని, ఎన్ని పండ్లు దానం చేస్తే పుట్టే పిల్లలకు అంత మేలు జరుగుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed