- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లవంగాలతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చా?
దిశ వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రతి ఒక్కరి వంట గదిలో లవంగాలు కచ్చితంగా ఉంటాయి. ఇవి ఘాటైన రుచిని కలిగి ఉండడంతో అన్ని వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే ఈ లవంగాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. కేవలం రోజుకు రెండు లవంగాలతో చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో చుద్దామా..
*లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
* నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక లవంగాన్ని తినడం వల్ల హ్యాప్పిగా నిద్రపోవచ్చు.
* దీంతో దంతాలు చెడిపోకుండా, సున్నితత్వం, అలాగే దంతాల నొప్పులను కూడా దూరం చేసుకోవచ్చు.
* ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు లవంగాలను తిని గోరు వెచ్చని నీరు తాగడం వల్ల మీ శరీరానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
* ఈ లవంగాలను ఉదయాన్నే పరగడుపున ఒక లవంగం తినడం వల్ల అధిక బరువు ఉన్నవారు ఈ సమస్య నుంచి ఈజీగా బయట పడొచ్చు.
* లవంగాలు శరీరంలో ఉన్న పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఒక నెలలో కనీసం 6,7 కిలోల బరువు తగ్గవచ్చు.
* అలాగే ఎముకలను ధృడంగా ఉంచడంలో, మలబద్ధకం సమస్యను తగ్గించడంలో అజీర్ణ సమస్యను, క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ లాంటి మరెన్నో సమస్యలకు లవంగాలు తీసుకోవడం వల్ల చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: