Brain Remote : బ్రెయిన్ కంట్రోలింగ్ రిమోట్

by Sujitha Rachapalli |
Brain Remote :  బ్రెయిన్  కంట్రోలింగ్  రిమోట్
X

దిశ, ఫీచర్స్: సౌత్ కొరియా శాస్త్రవేత్తలు బ్రెయిన్ కంట్రోల్ చేసే రిమోట్ డివైజ్ రూపొందించారు. కొరియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ కు చెందిన సైంటిస్టులు.. అయస్కాంత క్షేత్రం ద్వారా దూరం నుంచి మైండ్ ను మానిప్యులేట్ చేయగలిగే పరికరాన్ని కనిపెట్టారు. ఆడ ఎలుకలో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీ అప్లయ్ చేసిన వారు.. ఆకలిని తగ్గించేందుకు మెదడును ప్రాసెస్ చేసేందుకు కూడా ఉపయోగించారు. ఆ క్రమంలో సదరు ఎలుక పది శాతం వెయిట్ కోల్పోయినట్లు గుర్తించారు పరిశోధకులు.

ఇక మాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉపయోగించి బ్రెయిన్ లోని రిజియన్స్ ను ఫ్రీగా కంట్రోల్ చేసే పరికరం ప్రపంచంలో మొదటిది ఇదే. కాగా దీనికి Nano-MIND అని పేరు పెట్టుకున్నారు శాస్త్రవేత్తలు. దీన్ని వాడటం వల్ల మెదడులోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మార్పును గమనించనట్లు చెప్పారు. అందుకే హెల్త్ కేర్ అప్లికేషన్స్ లో వినియోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. బ్రెయిన్ పనితీరు, మోడ్రన్ ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్‌వర్క్స్, బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీలు, నాడీ సంబంధిత రుగ్మతలకు కొత్త చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తున్నా.. బయోలాజికల్ సిస్టమ్స్ ను మానిప్యులేట్ చేసే మ్యాగ్నేటిక్ ఫీల్డ్స్ ఇప్పటికే చాలా చోట్ల వాడుతున్నట్లు చెప్పారు.



Next Story