- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీరియడ్స్‌లో 1 రోజు మాత్రమే రక్తస్రావం అవుతుందా..? ఇది తప్పక తెలుసుకోండి!
దిశ, ఫీచర్స్: మహిళలు నెలసరి సమయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కో మహిళకు నెలసరి ప్రక్రియ ఒక్కోలా ఉంటుంది. కొందరికి వారం రోజుల పాటు రక్తస్రావం జరిగితే, మరికొందరికి రెండు లేదా మూడు రోజులకి ఆగిపోతుంది. ఇంకొందరికి ఒక్క రోజే నెలసరి వచ్చి ఆగిపోతుంది. ఇలా ఒక్క రోజు మాత్రమే వచ్చి ఆగిపోతే అది ఎలాంటి సమస్యకు కారణం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నెలసరి అనేది ఒక వయస్సు దాటిని తరువాత ఆగిపోతుంది. సాధారణంగా ఇది మూడు నుండి 5 రోజుల వరకు ఉంటుంది. కొందరికి ఏడు రోజుల వరకు రక్తస్రావం అవుతుంది. ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే పీరియడ్స్ రావడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే మహిళలకు ఇలా ఒకటి లేదా రెండు రోజులు మాత్రేమే రక్తస్రావం అవుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల పీరియడ్స్ ఆగిపోతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఒత్తిడి అనేది ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఇది మాత్రమే కాకుండా కఠినంగా వ్యాయామం చేసే మహిళలలో కూడా పీరియడ్ తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది. ఇలా కఠిన వ్యాయామం చేయడం వల్ల అండోత్సర్గాన్ని నియంత్రించే హోర్మోన్ల విడుదలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా థైరాయిడ్, పీసిఓఎస్, గర్భాశయ సమస్యలు ఉన్న మహిళలకు కూడా ఇలా ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే రక్తస్రావం అవుతుంది. ఇలా జరిగే వారి శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి సరిగా జరగదు. ఈస్ట్రోజన్ అనేది గర్భాశయంలో ఎండోమెంట్రియం అనే పొరను నిర్మించడంలో సహాయపడుతుంది. ఈ పొర రక్తస్రావం సజావుగా జరిగేలా చేస్తుంది. ఎప్పుడైతే ఈ పొర పలుచగా మారుతుందో అప్పుడు ఒకటి, రెండు రోజులు మాత్రమే రక్తస్రావం అవుతుంది. ఇలా జరుగుతున్నట్లైతే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం మంచిది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.