పిరుదులతో అందమే కాదు.. అనారోగ్యమే.. భారీ బటక్స్‌‌ను ఇలా తగ్గించుకోండి!

by Nagaya |   ( Updated:2022-05-03 06:05:29.0  )
పిరుదులతో అందమే కాదు.. అనారోగ్యమే.. భారీ బటక్స్‌‌ను ఇలా తగ్గించుకోండి!
X

దిశ, ఫీచర్స్ : మహిళల జఘనపు(బటక్) అందాల వర్ణణ సినీ పాటల్లో వినే ఉంటారు. అంతెందుకు బ్యాక్ బ్యూటీతో వెండితెరను ఏలిన హీరోయిన్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో ఆ అందాలను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తూ కుర్రకారు మతిపోగొట్టడం కామన్‌గా జరిగే విషయమే. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే. వాస్తవానికి భారీ బటక్స్‌ మూలంగా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంటున్నవారూ ఉన్నారు. అధిక మొత్తంలో అక్కడ కొవ్వు చేరడంతో బటక్స్ సైజు ఊహించనంతగా పెరిగిపోయి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు సులభ వ్యాయామాల ద్వారా బట్ ఫ్యాట్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

పిరుదుల చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల లోయర్ బాడీపై ఒత్తిడి పడుతుంది. ఆ భారాన్ని మోకాళ్లు, చీలమండలు మోయాల్సి ఉంటుంది. ఇక పొట్ట దిగువ భాగం, పిరుదుల చుట్టూ ఊబకాయం గుండెకు మంచిది కాదు. ఇలాంటి ఫ్యాట్‌ను తగ్గించుకోవాలంటే కార్డియో, లెగ్ ఎక్సర్‌సైజెస్ కీలకంగా పనిచేస్తాయి. ఇవి కేలరీలను ఖర్చుచేసి ఫ్యాట్‌ను కరిగిస్తాయి.

లోయర్ బాడీ స్త్రెంత్ కోసం పరుగు

ట్రెడ్‌మిల్‌పై లేదా ధృఢమైన నేలపై పరుగెత్తడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ఇది జీవక్రియను పునరుద్ధరిస్తుంది. ఇక తొడ కండరాలు, పిక్కలు, పిరుదులు, మోకాలి కీళ్లను బలోపేతం చేస్తుంది.

ఎలా చేయాలి : ట్రెడ్‌మిల్ లేదా ఫ్లాట్ గ్రౌండ్‌లో 30 సెకన్ల పాటు అధిక వేగంతో పరుగెత్తాలి. 30 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ రిపీట్ చేయాలి. ఇలా కనీసం 10 నిమిషాల పాటు కొనసాగించాలి. 30 సెకన్ల ఒక్కో స్ప్రింట్ ముగిసే సమయానికి అలసిపోయేంత వేగంగా పరుగెత్తాలి కానీ పూర్తిగా అలసిపోకూడదు.

స్క్వాట్స్

పిరుదులను తగ్గించే ఉత్తమ వ్యాయామాల్లో స్క్వాట్స్ ఒకటి. హై-రెప్ బాడీ వెయిట్ స్క్వాట్స్‌తో కాళ్లపై తీవ్రతను పెంచుతూ ఐదు సెట్లుగా 20 రెప్స్ చేయాలి.

ఎలా చేయాలి : పాదాలను భుజం వెడల్పుతో దూరంగా జరిపాలి. కుర్చీపై కూర్చున్నట్లుగా మోకాళ్లను వంచి బట్‌ను కిందకు దింపినట్లుగా చతికిలపడాలి. ఈ సమయంలో మొండెంను వీలైనంత నిటారుగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఇలా వీలైనంత దిగువకు వెళ్లి, ఆపై నిటారుగా నిలబడాలి.

లంజెస్

ఈ ఎక్సర్‌సైజ్ చూసేందుకు సరళంగానే అనిపించినా బ్యాక్ పార్ట్‌ను టోన్ చేసేందుకు ఇది సమర్థవంతమైన చర్య.

ఎలా చేయాలి: మీ పాదాలను భుజం వెడల్పుతో దూరం జరిపి ఒక కాలుతో పెద్ద అడుగు వేయాలి. వెనుక మోకాలిని నేల నుంచి ఒక అంగుళం వరకు కిందికి వదలాలి. తర్వాత పాదాలు మళ్లీ కలిసి ఉండేలా యథాస్థానానికి వచ్చి ఇప్పుడు వెనక కాలును ముందుకు వేయాలి. ఇలా ప్రతి కాలిపై ఆల్టర్నేటివ్‌గా 10 లంజెస్ చేయాలి.

మెట్లు ఎక్కడం

కేలరీస్ బర్నింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకునేందుకు ఎలివేటర్లు, ఎస్కలేటర్లను ఉపయోగించకుండా వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కాలి. చదునైన ఉపరితలంపై నడవడం, జాగింగ్ చేయడం లేదా పరుగెత్తడం కంటే మెట్లు ఎక్కినపుడు ఎక్కువ కండరశక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాదు తొడ కండరాలు, పిక్కలు, పిరుదులు స్టిఫ్‌గా మారతాయి. కాగా పిరుదులను తగ్గించే ఉత్తమ వ్యాయామాల్లో ఇదీ ఒకటి.

ఎలా చేయాలి : జిమ్‌ సెంటర్‌లో స్టెప్పింగ్ మెషిన్‌ను ఉపయోగించవచ్చు లేదా లిఫ్ట్ అందుబాటులో ఉన్నప్పటికీ మెట్లను ఉపయోగించవచ్చు.

ఆహారాన్ని తనిఖీ చేయడం మరవద్దు

కొవ్వును కరిగించడంలో పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం క్యాలరీల కొరత సృష్టించడం సులభమైన పద్ధతి. అంటే మీరు బర్న్ చేస్తున్న కొవ్వు కంటే తక్కువ కేలరీలు తీసుకోవడం అన్న మాట. ఎన్ని కిలోమీటర్లు పరుగెత్తినా, ఎన్ని స్క్వాట్స్ చేసినా.. కేలరీల లోటును ఏర్పరిచే పోషకాహారంపై దృష్టి పెట్టకుండా కొవ్వును కరిగించలేరని గుర్తుంచుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed