- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీర్ తయారు చేస్తున్న రోబోలు.. నెలరోజుల పని ఒక్కరోజులోనే పూర్తి..
దిశ, ఫీచర్స్: బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు శుభవార్త చెప్పారు శాస్త్రవేత్తలు. వాస్తవానికి బీర్‌ను ఉత్పత్తి చేసే ఫెర్మంటేషన్ ప్రాసెస్ నెల రోజులు తీసుకుంటుంది. కానీ, ఒక్క రోజులోనే బీర్‌ను తయారు చేసే రోబోటిక్ టెక్నాలజీని డెవలప్ చేశారు. చెక్ రిపబ్లిక్ పరిశోధకులు డెవలప్ చేసిన ఈ బీర్‌బోట్స్(BeerBots).. కస్టమర్‌లను చేరుకోవడానికి ముందే బీర్ పాడైపోయే అవకాశాలను తగ్గించడం ద్వారా కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.
Also Read: ఇరాన్ దేశ వంటకానికి ఇండియాలో యమ క్రేజ్..
స్వయంగా ఈస్ట్ మ్యాగ్నెటిక్ ప్యాకేజీలుగా పనిచేసే బీర్‌బోట్స్.. కిణ్వ ప్రక్రియను వేగవంతం చేయగలుగుతాయి. బాటిల్ చేయడానికి ముందు ఈస్ట్‌ను సంగ్రహించడానికి ఫిల్టర్ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తాయి. చక్కెరను ఆల్కహాల్‌గా మార్చడానికి లివింగ్ ఈస్ట్‌ని ఉపయోగించడం అనేది బీర్ తయారీలో కీలకమైన భాగం. కానీ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈస్ట్ పానీయం మొత్తం బ్యాచ్‌ను పాడు చేసి నాశనం చేస్తుంది. బదులుగా శాస్త్రవేత్తలు కేవలం మ్యాగ్నెట్‌తో బీర్ నుంచి చిన్న రోబోట్‌లను బయటకు తీయవచ్చు.
కాగా యాక్టివ్ ఈస్ట్, మాగ్నెటిక్ ఐరన్ ఆక్సైడ్ నానోపార్టికల్స్, ఆల్గే నుంచి సోడియం ఆల్జీనేట్‌లను కలపడం ద్వారా రెండు-మిల్లీమీటర్ల వెడల్పు గల బీర్‌బాట్ క్యాప్సూల్స్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు.. ఈ మిశ్రమాన్ని ఫెర్రిక్ క్లోరైడ్ ద్రావణంలో పోశారు. బీర్‌బాట్‌లో సగం భాగాన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్‌లోని ఆల్కలీన్ ద్రావణానికి ఎక్స్‌పోజ్ చేయడం మూలంగా గోళాల ఒక వైపు రంధ్రం ఏర్పడగా.. రోబోలు ఉపరితలంపైకి చేరుకున్నప్పుడు కార్బన్ డై ఆక్సైడ్‌ను గాలిలోకి విడుదల చేస్తాయి, మళ్లీ మునిగిపోతాయి. ఈ విధంగా ఫెర్మెంటేషన్ పూర్తయ్యాక, అవి కంటైనర్ దిగువన మునిగిపోతుండగా.. మ్యాగ్నెట్ సహాయంతో బీర్ నుంచి క్యాప్చర్ చేస్తారు. ఇలా సేకరించిన రోబోలు మరో మూడు కిణ్వ ప్రక్రియల్లో వినియోగించవచ్చు.