- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Beauty Tips : ఏజ్ పెరిగినా గ్లామర్ తగ్గొద్దంటే..
దిశ, ఫీచర్స్ : సాధారణంగానే వయసు పెరిగే కొద్దీ శరీరంలో పలు మార్పులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా యంగ్ ఏజ్‌లో ఉన్నంత గ్లామర్ ఉండదు. ఏజ్ పెరిగే కొద్దీ అందం కూడా తగ్గుతూ వస్తుంది. అయితే ఈ ప్రక్రియను కొంత ఆలస్యం చేయడంలో, వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో ఆహార నియమాలు, వ్యాయామాలు, పలు రకాల చిట్కాలు సహాయపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో చూద్దాం.
* సమతుల్య ఆహారం : పోషకాహారం లేదా సమతుల్య ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేయడంలో అందులోని పోషకాలు సహాయపడతాయి. అందుకే రోజువారీ డైట్‌లో భాగంగా పండ్లు, పప్పు ధాన్యాలు, తాజా కూరగాయలు, ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, ప్రొటీన్స్ వంటివి తప్పక ఉండేలా చూసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు.
* క్వాలిటీ స్లీప్ : ఏజ్ పెరిగే కొద్దీ శరీరం త్వరగా అలసిపోతుంది. హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి వంటివి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. నిద్ర అలవాట్లలో మార్పులకు కారణం అవుతాయి. అయితే నాణ్యమైన నిద్రను కోల్పోవడం మీ అందాన్ని కూడా తగ్గిస్తుంది. అంటున్నారు నిపుణులు. వయసు పెరిగిన వారు కూడా సరైన నిద్ర అలవాట్లను, క్వాలిటీ స్లీప్ సర్కిల్‌ను మెయింటైన్ చేస్తే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు.
*మేకప్ వద్దు : మేకప్ కోసం ఉపయోగించే పౌడర్లు, క్లెన్సర్ల తయారీలో రసాయనాలు కలుస్తాయనే విషయం తెలిసిందే. ఇవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రతిరోజూ మేకప్ వేసుకునే అలవాటు కారణంగా ముఖంపై ముడతలు రావచ్చు. చర్మం డ్రైగా, డల్‌గా, కాంతి హీనంగా మారుతుంది. కాబట్టి మేకప్ రోజూ వేసుకోవడం అంత సేఫ్ కాదంటున్నారు నిపుణులు. మేకప్ వేసేవారికంటే మేకప్ చేయని వారిలో వృద్ధాప్య ఛాయలు ఆలస్యం అవుతాయి. ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. అలాగా రోజూ వ్యాయామాలు, స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీస్ మానసిక ఆనందాన్ని, అందాన్ని పెంచడంలో, యవ్వనంగా కనిపించడంలో సహాయపడతాయి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Health : ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్.. ఆ లోపం వల్లే కావచ్చు!