- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bay Leaves for Sugar: ఈ ఒక్క ఆకుతో షుగర్ వ్యాధి కంట్రోల్.. ఎలా వాడాలంటే..
దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో మారుతున్న కాలానుగుణంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్‌లో మార్పుల కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. అలా వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్ బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే.. ఖచ్చితంగా ప్రతి రోజూ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిందే. కానీ మందులు వేసుకోకుండా.. మీరు తీసుకునే ఆహారంతోనే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. అందులో మైయిన్‌గా డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడంలో బిర్యానీ ఆకు ఎంతో చక్కగా పనిచేస్తుందని ఇటీవల జరిగిన పలు పరిశోధనల్లో తేలింది. మరి ఈ ఆకును ఎలా తీసుకోవాలి, బిర్యానీ ఆకుతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ తగ్గించేందుకు ఇలా తీసుకోండి:
ముందుగా ఓ పది బిర్యానీ ఆకులు తీసుకుని.. అందులో మూడు గ్లాసుల నీటిని వేసి.. ఓ పది నిమిషాలు మీడియం మంట మీద మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని.. రోజులో మూడు సార్లు తీసుకోండి. కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా తేనె కూడా మిక్స్ చేసుకొని తాగవచ్చు. కానీ నేరుగా తాగితేనే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. భోజనం చేసే ఓ గంట ముందు ఈ నీటిని తాగాలి. ఇలా మూడు రోజుల పాటు తాగాలి. మళ్ళీ ఓ రెండు వారాలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ మూడు రోజులు బిర్యానీ ఆకుల కషాయాన్ని తాగాలి. ఇలా చేయడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది.
ఆకుల పొడి:
కేవలం కాషాయ రూపంలోనే కాకుండా.. బిర్యానీ ఆకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఈ పొడిని ఉదయం, సాయంత్రం తినే గంట ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం అనేది కంట్రోల్ అవుతుంది.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.