చార్మినార్ వెళ్లే మహిళలకు గుడ్ న్యూస్.. ఆ షాపులో రూ.30కే బ్యాంగిల్స్!

by Jakkula Samataha |
చార్మినార్ వెళ్లే మహిళలకు గుడ్ న్యూస్.. ఆ షాపులో రూ.30కే బ్యాంగిల్స్!
X

దిశ, ఫీచర్స్ : చార్మినార్ అంటే అందరికి ముందుగా గుర్తు వచ్చేది లాడ్ బజార్ గాజులే. అక్కడ బ్యాంగిల్స్ అంటే మగువలకు ఎంతో ఇష్టం. ఏ చిన్న పార్టీ, పంక్షన్ జరిగినా అమ్మాయిలు స్నేహితులతో కలసి చార్మినార్ వెళ్లి రంగు రంగుల గాజులు కొనుగోలు చేస్తారు. కాగా,గాజులంటే ఇష్టపడే మహిళలకు గుడ్ న్యూస్ అందింది. చార్మినార్ లోని ఓ బ్యాంగిల్ స్టోర్‌లో అతి తక్కువ ధరకే బ్యాంగిల్స్ అమ్ముతున్నారంట. అది ఎక్కడో కాదు, లాడ్ బజార్ ప్రిన్స్ మార్కెట్‌లోని ఒక సందు లోపలకి వెళ్తే మనకి ఒక అద్భుతమైన స్టోర్ ఒకటి కనిపిస్తుంది. అదే రెయిన్‌బో బ్యాంగిల్స్ స్టోర్.

ఇక్కడ కొన్ని వందల రకాల డిజైన్స్‌లో బ్యాంగిల్స్ లభిస్తాయి. ఇక్సిడైడ్జ్ మెటల్, థ్రెడ్ బ్యాంగిల్స్, మట్టి గాజులు, కంకణాలు ఇలా రకరకాల గాజులు మహిళలను ఆకర్షించకుండా ఉండలేవంట. అంతే కాదండోయ్ లాక్ బ్యాంగిల్స్, మెటల్స్‌కు ఈ స్టోర్ ఎంతో ప్రత్యేకమంట. ఈ షాప్‌లోని గాజులలో దాగి ఉన్న మెరుపు రాళ్లను చూస్తే కొనకుండా ఉండలేరంట.ఇక ధరల విషయానికి వస్తే డజనుకు రూ.30 నుండి ప్రారంభమై రూ.500 వరకు ఉంటుంది. అయితే, ఇక్కడ బేరం చేస్తే దీని ధర సగానికి కూడా లభిస్తాయని వినియోగదారులు చెప్తున్నారు.మరీ ఇంకెందుకు లేట్, త్వరగా చార్మినర్ వెల్లి అతి తక్కువ ధరకే రంగు రంగుల గాజులను కొనుగోలు చేయండి.

Advertisement

Next Story