- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్‌ఎఫ్‌టీలో ఓవర్ సైజ్ వ్యక్తుల ఆర్ట్ కలెక్షన్
దిశ, ఫీచర్స్ : ఎన్‌ఎఫ్‌టీ క్రేజ్ ప్రస్తుతం వేరే లెవెల్‌లో ఉంది. డిజిటల్ ఆస్తులను అమ్ముతూ ఎంతోమంది కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇండియాలోనూ నటులు, మ్యూజిక్ డైరెక్టర్స్ సహా చిత్ర దర్శకులు సైతం ఎన్‌ఎఫ్‌టీ బాటపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే 'బ్యాడ్ యాస్ ఫామ్' పేరుతో ఓ ఎన్‌ఎఫ్‌టీ ప్రాజెక్ట్ మొదలైంది. ఇది 'ఓవర్ సైజ్డ్' వ్యక్తులకు పూర్తి మద్ధతుతో పాటు విరాళాలు అందిస్తోంది. అంతేకాదు భారీకాయుల విషయంలో బాడీ పాజిటివిటీ అందించే ప్రయత్నం చేస్తోంది.
ఈ సమాజంలో ఎలా ఉన్నా ఇబ్బందే. ముఖ్యంగా ఓవర్ సైజ్ వ్యక్తుల విషయంలో సమస్యాత్మకంగా వ్యవహరిస్తూ వారిని బాడిషేమింగ్, డిస్‌క్రిమినేషన్‌కు గురిచేస్తుంటారు. అలాంటి భారీకాయుల్లో ప్రధానంగా మహిళలకు తమ మద్దతు, సాయాన్ని అందించేందుకు 'బ్యాడ్ యాస్ ఫామ్' కృషి చేస్తోంది. ఈ మేరకు NFT ప్లాట్‌ఫామ్‌పై ఓ గొప్ప సహాయక సంఘాన్ని సృష్టించగా.. ఈ స్పేస్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీల్లో ఇదీ ఒకటిగా ఎదిగింది. ఈ ప్రాజెక్ట్‌ను టెకీ సావీ అయిన బర్డియా, ఫొటోగ్రాఫర్ బహరే కలిసి ప్రారంభించారు. బర్డియా కోడ్స్ రాసే బాధ్యతను కలిగి ఉంటే.. బహరే వివిధ ప్రాజెక్ట్‌లతో మార్కెటింగ్, కొలాబరేషన్ వంటి బాధ్యతలు తీసుకుంటుంది. ప్రసుతం 'బ్యాడ్ యాస్ ఫామ్' ట్విట్టర్‌లో దాదాపు 10 వేల మంది ఫాలోవర్లతో దూసుకుపోతోంది. ఇక బీఏఎఫ్ బృందం NFT కలెక్షన్ బాడీ పాజిటివిటీకి సంబంధించిన సేకరణపై దృష్టి సారించగా.. ఇందులోని ఆర్ట్ వర్క్ ప్రధానంగా భారీ వ్యక్తులు, వారి విభిన్న లక్ష్యాల్ని ప్రతిబింబిస్తాయి. మీ NFTని ప్రీ-సేల్‌లో సెక్యూర్ చేసేందుకు మీరు కచ్చితంగా వారి గేమ్స్ లేదా వారి సోషల్ మీడియా సవాళ్లలో పాల్గొనాలి.