నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలను పాటించండి

by Anjali |
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలను పాటించండి
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషి ఎంతకష్టపడి డబ్బులు సంపాదించినా సమయానికి ఆహారం, నిద్ర లేకపోతే తప్పకుండా ఆరోగ్యం చెడిపోతుంది. మనిషికి ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఒకవేళ మీకు సరిగ్గా నిద్రపట్టకపోతే వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటూ వీలైనంత ఎక్కువగా నిద్రపోండి. అది ఎలా సాధ్యమవుతుందని సందేహిస్తున్నారా.. అయితే ఈ ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ లవనీత్ చెప్పిన చిట్కాలను పాటిస్తే చాలు. అవి ఏంటో చూద్దాం..

*అశ్వగంధ ఒక అద్భతమైన ఆయుర్వేద పదార్థం. మానసిక ఒత్తిడిని తగ్గించి, శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. రాత్రి పడుకునే అరగంట ముందు ఈ ఔషధాన్ని తీసుకొంటే చక్కగా నిద్రపోవచ్చు.

*బాదం గింజలలో ఫైబర్ ఉంటుంది. వీటిలో అద్భుతమైన కొవ్వు పదార్థాలు, మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. పడుకునే ముందు బాదం పాలు తాగడం వల్ల కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది. నిద్ర బాగా పడుతుంది. నానబెట్టిన లేక ఒలిచిన బాదం పాల కంటే ఆరోగ్యకరమైనదని చెబుతున్నారు.

*అత్తిపండ్లు సమయానికి నిద్ర పోవడానికి బాగా పనిచేస్తాయి. ఇది మన శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్‌ని పెంచి ఆరోగ్యమైన నిద్రకు దారితీస్తుంది.

*గుమ్మడికాయ గింజలు కూడా నిద్ర పట్టడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వీటిలో జింక్, ట్రిప్టోఫాన్ ఉండడం వల్ల మెదడు నిద్రను ప్రేరేపించడానికి సెరోటోనిన్‌గా మారుస్తుంది. కాబట్టి మీరు ఈ ఫుడ్ నిపుణుడు చెప్పిన చిట్కాలను పాటిస్తే ప్రతిరోజు హ్యాప్పీగా నిద్రపోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed